'మజిలీ'ని చివరి నిమిషంలో ఆదుకుని, విడుదలయ్యేలా సాయం చేశాడు

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు శివ నిర్వాన దర్శకత్వం వహించాడు.

 Helped In Last Minute To Release The Movie-TeluguStop.com

నిన్ను కోరి వంటి విభిన్నమైన లవ్‌ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన శివ నిర్వాన ఈ చిత్రంను కూడా అదే తరహాలో ఒక మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీని, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో తీసుకు రాబోతున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించడం జరిగింది.

శివ నిర్వాన మాట్లాడుతూ… ఈ చిత్రంకు సంగీతం అందించి గోపీ సుందర్‌ షూటింగ్‌ అంతా పూర్తి అయిన తర్వాత రీ రికార్డింగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మ్యూజిక్‌ ఇచ్చేందుకు సమయం కావాలని అన్నాడు.అయితే అప్పటికే విడుదల తేదీ దగ్గర పడుతుందనే టెన్షన్‌ నన్ను వెంటాడుతుంది.

ఆయన సినిమాను కాస్త వాయిదా వేసుకోండి, రెండు వారాల పాటు తనకు వేరే కమిట్‌ మెంట్స్‌ ఉన్నాయని చెప్పాడు.ఆ సమయంలో నేను ఫ్రీజ్‌ అయ్యాను, ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాను.

ఆ సమయంలోనే నాకు థమన్‌ గుర్తుకు వచ్చాడు.

సహజంగా కేవలం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రమే చేయమంటే మాత్రం పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఒప్పుకోరు.కాని థమన్‌ గారు నేను అడిగిన వెంటనే ఒప్పుకున్నారు.ఒక వేళ ఆయన సాయం చేయకుంటే సినిమా ఖచ్చితంగా వాయిదా పడేది.

సినిమా అనుకున్న సమయంకు విడుదల అయ్యేలా చేశాడు.దర్శకుడు శివ నిర్వాన మరియు గోపీసుందర్‌కు మద్య విభేదాలు ఉన్న విషయం తాజాగా ఈ సంఘటనతో నిరూపితం అయ్యింది.

సినిమా ప్రారంభం అయిన కొన్ని వారాలకే ఇద్దరి మద్య వివాదం అంటూ వార్తలు వచ్చాయి.అప్పుడు వాటిని యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు.

అయితే ఇప్పుడు సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను థమన్‌ తో చేయించాను అంటూ చెప్పడంతో ఇద్దరి మద్య వివాదం నడిచిందని క్లారిటీ వచ్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube