కెనడాలో భారతీయ విద్యార్ధులపై బహిష్కరణ వేటు .. పిల్లలను ఆదుకోండి : కేంద్రానికి ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ లేఖ

నకిలీ పత్రాలతో వీసాలు సంపాదించి కెనడాలో( Canada ) అడుగుపెట్టిన విదేశీ విద్యార్ధులు చిక్కుల్లో పడ్డారు.ఇందుకు గాను వారిని దేశం నుంచి బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 Help Indian Students Facing Deportation In Canada, Sad Mp Harsimrat Kaur Badal U-TeluguStop.com

బాధితుల్లో భారతీయ విద్యార్ధులు కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ లిస్ట్‌లో దాదాపు 150 మంది వరకు పంజాబ్ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులే వున్నారు.

తాజాగా ఈ వ్యవహారంపై శిరోమణి ( Shiromani )అకాలీదళ్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ( Harsimrat Kaur Badal )స్పందించారు.విద్యార్ధులను కెనడా నుంచి బహిష్కరించకుండా అడ్డుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌ను ఆమె కోరారు.

దీనికి సంబంధించి హర్‌సిమ్రత్ కౌర్ ఆయనకు లేఖ రాశారు.విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Telugu Canada, Indian Canada, Indian, Jaishankar, Sadmp-Telugu NRI

ఇప్పటికే 700 మంది విద్యార్ధులపై చర్యలు తీసుకోగా.ఇప్పుడు మరో 200 మంది విద్యార్ధులు నకిలీ అడ్మిషన్లు లెటర్లు తెచ్చారని తేలింది.దీంతో సదరు విద్యార్ధులకు కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ( Canadian Border Services Agency ) (సీబీఎస్ఏ) బహిష్కరణ నోటీసులు ఇచ్చిందని హర్‌సిమ్రత్ కౌర్ అన్నారు.ఒక్కో విద్యార్ధి నుంచి రూ.16 నుంచి 20 లక్షలు వసూలు చేసిన కేటుగాళ్లు నకిలీ అడ్మిషన్ లెటర్ ఇచ్చారని ఆమె తెలిపారు.

Telugu Canada, Indian Canada, Indian, Jaishankar, Sadmp-Telugu NRI

మరోవైపు.విద్యార్ధుల బహిష్కరణపై ఇప్పటికే కెనడాలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.పంజాబీ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరించవద్దని ఎన్‌డీపీ.

ప్రభుత్వాన్ని కోరింది.రిక్రూటర్ల మోసం వల్ల ఇప్పటికే నష్టపోయిన విద్యార్ధులు మూల్యం చెల్లించుకోవాల్సి రావడం బాధాకరమని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

మోసపూరిత ట్రావెల్ డాక్యుమెంటేషన్‌ను పొందిన విద్యార్ధులకు సహాయం చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని తాను ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్‌కు మే 25న లేఖ రాశానని.ఎన్‌డీపీకి చెందిన జెన్నీ క్వాన్ పేర్కొన్నారు.

కాగా.కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.

ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube