చెబితేనే చేస్తారేమో: మాతృదేశం కోసం... అమెరికా చట్టసభ సభ్యుల బాటలో యూకే ఎన్ఆర్ఐలు

కరోనా మహమ్మారి విజృంభణతో మునుపెన్నడూ లేని రీతిలో భారతదేశం విపత్తును ఎదుర్కొంటోంది.తొలి దశ నాడు కలిసికట్టుగా వైరస్‌తో తలపడిన ఇండియా.

 Help India In Hour Of Crisis, Says British Mp Dhesi, India,  Britain‌, Nri,  B-TeluguStop.com

ఇప్పుడు అలిసిపోయిందో లేక అస్త్రశస్త్రాలు సరిపోవడం లేదో కానీ ప్రస్తుతానికి మహమ్మారిదే పైచేయిగా వుంటోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 3,79,257 కేసులు కొత్తగా నమోదయ్యాయి.

వీటితో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524కి చేరింది.నిన్న ఒక్కరోజులో ఎన్నడూ లేని విధంగా 3,645 మంది మరణించారు.

దీంతో భారత్‌‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, మందులు, వైద్య పరికరాలు, రెమ్‌డిసివర్ ఇంజెక్షన్ వంటి వాటిని పంపుతున్నాయి.ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అమెరికా గురించి.క్లిష్ట సమయంలో అండగా నిలబడ్డ భారత్‌ను ఆదుకోవాలని బైడెన్ ప్రభుత్వంపై అమెరికన్లు, భారత సంతతి ప్రజలు, సొంత పార్టీలు నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు.

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో అధ్యక్షుడు మెట్టు దిగారు.భారత్‌కు అన్ని రకాలుగా అండగా వుంటామని ప్రకటించిన బైడెన్.

ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.తాజాగా ఇండియాకు వంద మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది.

వీటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల ఎన్ 95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లు, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీ సామాగ్రిని భారత్‌కు పంపుతామని ప్రకటించింది.

ఇప్పుడు భారత సంతతి అమెరికన్లు అనుసరించిన మార్గాన్ని ఎంచుకున్నారు బ్రిటన్‌లోని ఎన్ఆర్ఐలు.

ఇండియాను ఆదుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరారు భారత సంతతి ఎంపీ తన్మింజీత్ సింగ్ ధేసీ.హౌస్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడిన ఆయన.భారత్‌లో ఆందోళనకర పరిస్ధితులు నెలకొన్నాయని.ఆక్సిజన్, టెస్టింగ్ కిట్లు, మందుల కొరతతో ఎన్నో ప్రాణాలు పోతున్నాయని ధేసీ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Boris Johnson, Britain, India, Mp Dhesi, Oxygen, Kits-Telugu NRI

ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులతో యూకేలో స్థిరపడిన ప్రవాస కుటుంబాలు తమ వారి క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ధేసీ పేర్కొన్నారు.ఇటువంటి పరిస్ధితుల్లో ఇండియాకు మద్ధతుగా నిలబడాలని ఆయన ప్రధానిని కోరారు.కాగా, కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు బ్రిటన్ ఇప్పటికే సాయాన్ని ప్రకటించింది.అత్యవసర సాయం కింద ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య సామాగ్రి, వెంటిలేటర్లను పంపింది.అయితే ఈ సాయాన్ని మరింత పెంచాలని పలువురు ప్రవాస భారతీయులు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube