ఇటీవల కాలంలో రోడ్లపై కొందరు యువకులు చేస్తున్న ఘటనలు చాలా నవ్వు తెప్పిస్తున్నాయి.వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఒక బిజీ రోడ్డులో ఓ వ్యక్తి దున్నపోతు( Bull ) లేదా బర్రెపై స్వారీ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.ఈ యువకుడు హెల్మెట్( Helmet ) కూడా ధరించాడు, తద్వారా ట్రాఫిక్ రూల్స్ పాటించాడు.
అయితే అతను బర్రెను బాధ పెడుతున్నాడని, జంతువులను ఇలా చేయకూడదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియోలో( Viral Video ) మొదటగా దున్నపోతుపై నుంచి యువకుడు కింద పడటం కనిపించింది.అయితే ఈ టెక్నిక్ వర్కౌట్ కాలేదని, మరొక టెక్నిక్ ప్రయత్నిస్తున్నానని వీడియోలో రాసి తెలిపారు.ఆ తర్వాత, ఆ వ్యక్తి దున్నపోతుపైకి ఎక్కి హెల్మెట్ ధరించి దానిని గుర్రం లాగా రైడ్ చేస్తున్నట్లు కనిపించింది.
ఈ వీడియోను ‘bull_rider_077’ అనే వినియోగదారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.కొన్నిసార్లు కిందపడటం చాలా ముఖ్యం అని హిందీలో రాశారు.చాలా మంది ఈ వీడియోను చూసి రియాక్ట్ అయ్యారు.ఇది జంతు హింస అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు వీడియోను రిపోర్ట్ చేశారు.ఇలాంటి మనుషుల వల్ల మూగ జంతువులకు కష్టాలు తప్పవని మరికొందరు పేర్కొన్నారు.ఈ ఎద్దు పై ప్రయాణించడానికి( Bull Ride ) సదరు యువకుడికి పెట్రోల్, సర్వీస్, లైసెన్స్ అవసరం లేదని కొందరు జోకులు వేశారు.ఈ వీడియో చాలామందిలో నవ్వులు పూయించింది.
ఈ వీడియోకు ఇప్పటి వరకు 90 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఇన్స్టాగ్రామ్లో ఇదే యువకుడు వివిధ వీధుల్లో ఎద్దును స్వారీ చేసిన అనేక ఇతర వీడియోలను కూడా ఉన్నాయి.
ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.