అయ్యోయో... కార్చిచ్చు ఆర్పటానికి వెళ్లిన పైలెట్ సజీవదహనం...!

2020 ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఆస్ట్రేలియా అడివిలో సంభవించిన కార్చిచ్చు సంఘటన మరువకముందే… కాలిఫోర్నియాలోని కౌంటీ ప్రాంత అడవుల్లో మరో కార్చిచ్చు ఏర్పడింది.ఇలా మంటలను ఆర్పేందుకు వెళ్లిన చాపర్ పైలెట్ సజీవ దహనం అయిన సంఘటన చోటు చేసుకుంది.

 Pilot Killed In Helicopter Crash While Fighting San Francisco Fire, Forest, Heli-TeluguStop.com

మంటలు పెద్ద ఎత్తున్న సడన్ గా ఎగిసి పడడంతో ఈ సంఘటన జరిగినట్టు అర్థం అవుతుంది.అడవిలో మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో ఇలా ప్రమాద బారిన పడటం చాలా బాధాకరమని ఆ దేశ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

గత మూడు రోజుల నుండి శాన్ ఫ్రాన్సిస్ కో నగరానికి ఉత్తరాన వాకే విల్లే నగరానికి సమీపంలో ఉన్న 46 వేల ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్న పర్వతాల కౌంటీలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.కార్చిచ్చు కారణంగా ఏర్పడిన మంటలు అదుపులో తీసుక రావడానికి అధికారులు పెద్ద ఎత్తున కార్యాలు చేపడుతున్నారు.

దీనిని అదుపు చేసేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్స్ ఏర్పాటు చేసి మంటలను అదుపు తెచ్చే ప్రయత్నాలు అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఇక ఇప్పటికే ఆ ప్రాంతంలో వందకు పైగా నిర్మాణాలు పూర్తిస్థాయిలో అగ్నికి ఆహుతి అయ్యాయి కూడా.

ఇక ఈ ప్రాంతంలో నివసించే వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.దాదాపు 46 వేల ఎకరాలలో వ్యాపించిన ఈ కార్చిచ్చు అడవిలో అగ్ని దావనంలా ప్రవహిస్తుంది.

మంటలు అధికంగా వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో ప్రజలు అన్ని వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.ఇక ఇప్పటికే చాలా వన్య ప్రాణాలు కూడా మృత్యువాత పడ్డాయని అగ్నిమాపక రక్షక శాఖ అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube