చిరుతతో ముళ్ల పంది ఫైట్.. మామూలుగా లేదుగా..!

ఎలాంటి అడవి జంతువులనైనా భయపెట్టగలదు చిరుతు.చిరుత వేగాన్ని కళ్లతో చూస్తే నమ్మశక్యంగా ఉండదు.

 Hedgehog Fight With Leopard Not As Usual , Fight, Leopard, Hedgehog, Porcepin, L-TeluguStop.com

అంతలా జెట్​ స్పీడ్​ తో చిరుత పరుగెడుతూ… తన కంట పడిన జంతువులను చాకచక్యంగా వేటాడుతుంది.చిరుత దాడి చేస్తే ఎంత భయానకంగా ఉంటుందో అందరికీ తెలుసు.

అనుభవం లేకపోయినా కనీసం వీడియోలోనైనా చిరుత దాడులు చూసే ఉంటారు.అలాంటిది ఓ చిరుత పులినే ముళ్ల పంది హడలెత్తించింది.

నువ్వెంత.అంటే నువ్వెంత అనే మాదిరిగా ఉన్న చిరుత ముళ్లపంది ఫైట్​ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

అసలు వీటి ఫైట్ సంగతేంటని చూస్తే…

సాధారణంగా మనం చిరుత పులిని చూస్తేనే వణికిపోపతాం.ప్రాణ భయంతో సురక్షిత ప్రాంతానికి పరుగులు తీస్తాం.

కానీ ఈ వీడియోలో ఉన్న ముళ్ల పంది మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా చిరుత పులికే చుక్కలు చూయించింది.ఆ ముళ్ల పంది తెగువకు ఆశ్చర్యపోయిన చిరుత పులి చివరికి అక్కడి నుంచి వెనుదిరిగింది అంటేనే అర్థం చేసుకోవచ్చు.

ముళ్ల పంది చూపిన అసమాన ప్రతిభ.

జంతువులు రెండు ఫైట్​ చేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్​ చేయగా… అది కాస్త వైరల్​ గా మారింది.చిరుత పులి వచ్చిక ఏ మాత్రం బెదరకుండా ముళ్ల పంది చూపిన తెగువకు ఫిదా అయిన నెటిజన్లు తెగ లైక్​ చేస్తూ… ఈ వీడియోను ఫార్వార్డ్​ కూడా చేస్తున్నారు.అంతే కాకుండా ఫన్నీ కామెంట్లు కూడా పోస్ట్​ చేస్తున్నారు.

దీంతో నెట్టింట ఈ వీడియో రచ్చ.రచ్చ చేస్తుంది.

ఈ వీడియోను చూసిన కొంత మంది చేసిన కామెంట్లు హోరెత్తున్నాయి.ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది చూసి వేలల్లో కామెంట్లు పోస్టు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube