భీష్మ సినిమాపై హీరోయిన్ గుస్సా.. ఎందుకో తెలుసా?  

Hebah Patel Unsatisfied With Bheeshma Movie - Telugu Bheeshma, Hebah Patel, Nithiin, Rashmika Mandanna, Venky Kudumula

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ నేడు ప్రేక్షకుల మందుకు వచ్చింది.ఈ సినిమాతో నితిన్ అదిరిపోయే హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Hebah Patel Unsatisfied With Bheeshma Movie - Telugu Nithiin Rashmika Mandanna Venky Kudumula

వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.అయితే ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కుమారి 21F చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హెబ్బా పటేల్, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించింది.కానీ అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ కలిసి రాలేదు.

దీంతో ఈ బ్యూటీ ప్రస్తుతం ఫేడవుట్ హీరోయిన్‌గా మారింది.దీంతో ఈ బ్యూటీకి భీష్మ చిత్రంలో ఓ కేమియో పాత్రను ఇచ్చారు చిత్ర యూనిట్.

ఈ పాత్ర అమ్మడికి మంచి పేరు తెస్తుందేమో అనుకున్న హెబ్బా, ఆ తరువాత అబ్బా అంటోంది.ఈ సినిమాలో ఆమె చేసన పాత్ర పెద్దగా ప్రాముఖ్యం లేనిది కావడంతో ఆమె చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.

దీంతో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడా పాల్గొనలేదని తెలుస్తోంది.తనకు మంచి పాత్ర ఇస్తామని చెప్పి, కేవలం కేమియో పాత్రకే పరిమితం చేయడం, ఉన్నదాంట్లో కూడా ఆమె పాత్రను తగ్గించడంతో హెబ్బా భీష్మ చిత్ర యూనిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

మరి ఈ బ్యూటీ కోపానికి గల కారణం ఆమె చేసిన పాత్రనేనా లేక వేరే ఏదైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

Hebah Patel Unsatisfied With Bheeshma Movie-hebah Patel,nithiin,rashmika Mandanna,venky Kudumula Related Telugu News,Photos/Pics,Images..