గాయని అవతారం ఎత్తిన హెబ్బా పటేల్... ఫైనల్ గా వెబ్ సిరీస్ ని నమ్ముకుంది  

Hebah Patel Try As A Singer For Her Web Series-director Krish,hebah Patel Try As A Singer,telugu Cinema,tollywood,web Series

అలా ఎలా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ హేబ్బా పటేల్.మొదటి సినిమా ఒక మోస్తరు హిట్ అయిన రెండో సినిమా కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఈ భామ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది.

Hebah Patel Try As A Singer For Her Web Series-Director Krish Hebah Telugu Cinema Tollywood Series

ఈ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ క్యారెక్టర్ ని యూత్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.ఇక ఈ భామకి టాలీవుడ్ లో తిరుగులేదని అందరూ భావించారు.

అనుకున్న విధంగానే వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి.యువ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా హెబ్బా మారిపోయింది.

ఇక మెగా హీరో వరుణ్ తేజ్ తో కూడా జోడీ కట్టే అవకాశం వచ్చింది.అయితే కుమారి తర్వాత ఈ భామకి ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్ ఇవ్వలేదు.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ కొట్టి గాడిలో పడ్డట్లే అనిపించింది.

అయితే దర్శకులు మాత్రం ఈ పాప మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.

దీంతో చేతిలో పెద్దగా సినిమాలు లేకుండా అయిపొయింది.అయితే పొరుగు ఇండస్ట్రీలో కూడా ఈ భామకి అవకాశాలు రాలేదు.

దీంతో చివరికి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒకే చెప్పింది.అజయ్‌ భుయాన్‌ దర్శకత్వంలో క్రిష్‌ జాగర్లమూడి నిర్మాతగా ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది.

నవదీప్‌, చాందినీ చౌదరి, బిందు మాధవి, హెబ్బా పటేల్‌ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

అయితే దీని కోసం హెబ్బా పటేల్‌ తనలోని గాయనిని బయటికి తీసుకొచ్చింది.దర్శకుడు ఆమెతో ఆమె ఒక పాట పాడించాడు.ఇటీవల ఈ పాట రికార్డింగ్ కూడా జరిగిపోయినట్లు తెలుస్తుంది.హీరోయిన్ గా ఇంత కాలం అందరికి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మలోని గాయని ఎంత వరకు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి.

.

తాజా వార్తలు

Hebah Patel Try As A Singer For Her Web Series-director Krish,hebah Patel Try As A Singer,telugu Cinema,tollywood,web Series Related....