అన్ని వదులుకొని ఐటమ్ బాంబ్ గా మారిన రాజ్ తరుణ్ హీరోయిన్

హెబ్బా పటేల్ అంటే తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అవ్వకపోవచ్చు కాని కుమారి 21ఎఫ్ హీరోయిన్ అంటే మాత్రం అందరూ వెంటనే గుర్తు పడతారు.ఈ భామ కెరియర్ లో వచ్చిన రెండో సినిమా కుమారి.

 Hebah Patel Item Song In Ram Red Movie-TeluguStop.com

ఇప్పటికే అదే సినిమాతో హెబ్బా పటేల్ తో టాలీవుడ్ లో గుర్తిస్తున్నారు అంటే ఆమె చేసిన సినిమాలలో తనకి ఎంత వరకు గుర్తింపు తీసుకోచ్చాయో అర్ధం చేసుకోవచ్చు.కెరియర్ ఆరంభంలో యువ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా ఉండి దర్శకులని సైతం టెంప్ట్ చేసిన ఈ భామకి వరుసగా ఫ్లాప్ లు పడటంతో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా రూపంలో హిట్ వచ్చిక కెరియర్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.ఇతర భాషలలో ఈ భామని ఎవరు పట్టించుకోవడం లేదు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం మస్తీ అనే ఒక వెబ్ సిరీస్ లో ఈ భామ నటిస్తుంది.ఇప్పుడు ఊహించని విధంగా ఐటెం భామ అవతారం ఎత్తింది.రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెడ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం హెబ్బా పటేల్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది.శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది.

పెద్దగా డాన్స్ రాని హెబ్బాతో మొదటి సారి ఈ సాంగ్ కోసం ఎక్కువ డాన్స్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది.మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ భామ అందాల విందు అందించే విధంగా ఈ ఐటమ్ సాంగ్ ఉంటుందని టాక్.ఈ సాంగ్ హిట్ అయితే కొద్ది రోజుల పాటు తెలుగులో మరో ఐటెం భామగా పాటలకి స్టెప్పులు వేసే అవకాశం సొంతం చేసుకొని కెరియర్ సాఫీగా సాగించేస్తుంది.

మరి అంతలో హీరోయిన్ గా అవకాశాలు మళ్ళీ అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube