దేశ రాజధాని ఢిల్లీలో జీ 20 సదస్సు జరగనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు అయింది.ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.
నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని అధికారులు తెలిపారు.అదేవిధంగా సెంట్రల్ ఢిల్లీలో మెడికల్ షాపులు, పాల బూత్, పండ్ల దుకాణాలు అన్ని తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.
ప్రగతిమైదాన్ నియంత్రిత జోన్ లోకి ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సిబ్బంది, వైద్య సిబ్బంది వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలకు అనుమతిని ఇచ్చారు.మరోవైపు విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను కూడా అనుమతించనున్నారు.
కాగా రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగే జీ20 సమ్మిట్ కు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్న సంగతి తెలిసిందే.