ముంబైలో భారీ వర్షాలు .. నీట మునిగిన మహానగరం..!!

ముంబై మహానగరాన్ని ప్రకృతి పగబట్టినటు ఉంది.కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఈ నగరంలో మొదటినుండి ఉందన్న సంగతి తెలిసిందే.

 Heavy Rains In Mumbai City Mumbai, Corona Virus, Havey Rain , Mumabai , Railway-TeluguStop.com

ఈ పరిణామంతో బాలీవుడ్ షూటింగులు ఇంకా అనేక ఆర్థిక కార్యకలాపాలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కలకలలాడే ముంబై నగరం బోసి పోయినట్లు అయిపోయింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ముంబై లో మహమ్మారి ప్రభావం తగ్గుతూ ఉన్న నేపథ్యంలో   ఒక్కసారిగా భారీ వర్షాలు రావటంతో ముంబైని వరదలు ముంచెత్తిన పరిస్థితి నెలకొంటుంది.

భారీ వర్షాలతో నీట మునిగిన మహా నగరం రోడ్లపై నీరు భారీగా వచ్చేసాయి.అదే రీతిలో రైల్వే పట్టాలు కూడా నీటిలో మునిగిపోయాయి.పరిస్థితి ఇలా ఉండగా మరో ఐదు రోజులు భారీ వర్ష సూచన బొంబాయి కి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అంతేకాకుండా వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు కొన్కన్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి.థానే, రాయిగడ్, బీడ్ ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి.లోకల్ ట్రైన్స్ మెల్లగా కదులుతున్నాయి జనజీవనం స్తంభించిపోయింది.మొత్తంమీద చూసుకుంటే ముంబై మొత్తం నీట మునిగే పరిస్థితి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube