బెల్లంకొండ చత్రపతి రీమేక్ కష్టాలు... ఆరు కోట్ల సెట్ డామేజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్లోకి హీరోగా తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ చత్రపతి రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో అడుగుపెడుతున్నాడు.

 Heavy Rains Damage Bellamkonda Srinivas Chatrapathi Set, Tollywood, Vv Vinayak,-TeluguStop.com

వివి వినాయక్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సక్సెస్ అయిన వివి వినాయక్ ప్రస్తుతం ఫేడ్ అవుట్ అయిపోయాడు.

అతని దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లోకి అల్లుడు శ్రీను మూవీతో తెరంగేట్రం చేశాడు.ఈ నేపధ్యంలో సెంటిమెంటల్ గా కలిసొస్తుందని ఛత్రపతి రీమేక్ కోసం అతనిని ఫైనల్ చేశారు.

వివి వినాయక్ కి ఇదే ఫస్ట్ హిందీ మూవీ కావడం విశేషం.బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ కోసం సుమారు ఆరు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా సెట్ నిర్మించారు.

అయితే ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే తాజాగా తుఫాన్ ప్రభావంకి ఈ సెట్ పూర్తిగా డామేజ్ అయింది.

భారీ బడ్జెట్ అనుకున్న కూడా షూటింగ్ స్టార్ట్ చేయకుండానే కంప్లీట్ సెట్ మొత్తం డామేజ్ కావడంతో మళ్లీ కొత్తగా దీన్ని నిర్మించాల్సిన అవసరం వచ్చింది.ఓ వైపు సినిమాకి ప్రకృతి నుంచి ఆటంకం ఏర్పడుతుంటే మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ ఎంపిక దర్శకనిర్మాతలకు తలకు మించిన భారం అవుతుంది.

భారీ రెమ్యునరేషన్ ఇచ్చి స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని ప్రయత్నం చేసిన ఎవరు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తో జత కట్టడానికి ఆసక్తి చూపించడం లేదు.కొత్త హీరో కావడంతో కొత్త హీరోయిన్ ని ఎంపిక చేయడం అంటే అది సినిమాకి బిజినెస్ పరంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని నిర్మాత భావిస్తున్నారు.

ఈ సినిమా కోసం కంప్లీట్ గా బాలీవుడ్ కాస్టింగ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.అయితే కాస్టింగ్ ఫైనల్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు.ఇంతలో ప్రకృతి రూపంలో ఇప్పుడు సినిమాకి ఆరు కోట్ల రూపాయల వరకు జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube