డోస్ పెంచిన సాహో  

Heavy Promotion Plans For Saaho-astria,august 30th,prabhas,promotions Start,release,saaho,sujith,uv Creations

సాహో సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెబల్ ఫ్యాన్స్ తో పాటు నేషనల్ వైడ్ సినీ ఆడియెన్స్ కూడా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. .

డోస్ పెంచిన సాహో-Heavy Promotion Plans For Saaho

అయితే సినిమా రిలీజ్ డేట్ (ఆగస్టు 30) దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్ డోస్ కూడా పెంచేస్తున్నారు. దర్శకుడు సుజిత్ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తో కలిసి తెరకెక్కించిన ఈ సినిమా హిందీలో కూడా గ్రాండ్ గా విడుదల కానుంది.

అయితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ప్రబాస్ వాడిన 5కోట్ల కారును జనాల ముందుకు తెనున్నారట. .

అస్ట్రియాలో స్పెషల్ గా సాహో సినిమా కోసం తయారు చేసిన ఈ కారును అభూదాబి షెడ్యూల్ లో గట్టిగా వాడారట. ఇక ఈ ప్రత్యేకమైన కారును జనాలలు అందరూ చూసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే హిందీలో కొంత ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ సౌత్ లో కూడా డోస్ పెంచాలని చూస్తోంది.