ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన మాజీ క్రీడాకారుడు...భారీ జరిమానా

మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అన్న రూల్స్ మనకే కాదు విదేశాల్లో కూడా ఉంది.అందుకే మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్ హమ్ కు బ్రిటన్ కోర్టు భారీ జరిమానా విధించింది.

 Heavy Penalty For Ex Foot Ball Player-TeluguStop.com

అంతేకాకుండా అతడి డ్రైవింగ్ పై నిషేధం కూడా విధించినట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే… లండన్ లోని వెస్ట్ ఎండ్ లో బెకహామ్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశారు.

అయితే దీనిని గమనించిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం తో పోలీసులు ఆరా తీశారు.దీనితో విచారణ చేపట్టిన అధికారులు ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నిజమే అని తేలడం దానికి బెకహమ్ కూడా అంగీకరించడం తో పోలీసులు కేసు నమోదు చేసారు.

దీనితో కోర్టు లో కేసు విచారణ జరగగా బెక హామ్ చర్యకు కోర్టు 750 పౌండ్ల భారీ జరిమానా తో పాటు ఆరునెలల పాటు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube