ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన మాజీ క్రీడాకారుడు...భారీ జరిమానా  

Heavy Penalty For Ex-foot Ball Player-david,ex-foot Ball,heavy,penalty,player,క్రీడాకారుడు

మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అన్న రూల్స్ మనకే కాదు విదేశాల్లో కూడా ఉంది. అందుకే మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్ హమ్ కు బ్రిటన్ కోర్టు భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా అతడి డ్రైవింగ్ పై నిషేధం కూడా విధించినట్లు తెలుస్తుంది..

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన మాజీ క్రీడాకారుడు...భారీ జరిమానా -Heavy Penalty For Ex-foot Ball Player

వివరాల్లోకి వెళితే… లండన్ లోని వెస్ట్ ఎండ్ లో బెకహామ్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశారు.

అయితే దీనిని గమనించిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం తో పోలీసులు ఆరా తీశారు. దీనితో విచారణ చేపట్టిన అధికారులు ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నిజమే అని తేలడం దానికి బెకహమ్ కూడా అంగీకరించడం తో పోలీసులు కేసు నమోదు చేసారు. దీనితో కోర్టు లో కేసు విచారణ జరగగా బెక హామ్ చర్యకు కోర్టు 750 పౌండ్ల భారీ జరిమానా తో పాటు ఆరునెలల పాటు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది.