తెలుగు రాష్ర్టాలదే రికార్డు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించాయి.ఇది అభివృద్ధిలో కాదు, పరిశ్రమల్లో కాదు, విద్యలో కాదు, ఆరోగ్యంలో కాదు….

 Heat Wave Kills Over 1,100 In Andhra Pradesh And Telangana-TeluguStop.com

ఏ ఇతర రంగంలోనూ కాదు.ఈ రికార్డు ‘వడదెబ్బ మరణా’లకు సంబంధించింది.

ఈ రెండు రాష్ర్టాల్లో ఈ ఎండా కాలంలో సూర్య ప్రతాపానికి వందలాదిమంది చనిపోయారు.కొన్ని మరణాలు మీడియాకు అందకపోవచ్చు కూడా.

ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎంత మంది చనిపోయారనే విషయం అలా ఉంచితే, కేవలం గత పది రోజుల్లోనే ఒక వెయ్యి వందమంది ప్రాణాలు కోల్పోయారు.వృద్ధులే కాదు,వయసులో ఉన్నవారూ పోయారు.

తెలుగు రాష్ర్టాల్లోనే వెయ్యి మంది చనిపోగా, దేశంలోని ఇతర రాష్ర్టాలన్నింటిలో కలిపి ఇరవై వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదివందల యాభై రెండు మంది చనిపోగా, తెలంగాణలో రెండొందల అరవై తొమ్మిది మంది చనిపోయారు.

గత పది రోజుల్లో సూర్య ప్రతాపం తెలంగాణలోని ఖమ్మంలోనే అత్యధికం.ఏపీలో ఒక్క గుంటూరులోనే వంద మంది చనిపోయారు.

ఈసారి తెలుగు రాష్ర్టాల్లో భానుడి సెగలు ఎడారి ప్రాంతాన్ని మించిపోయిందని చెప్పొచ్చు.చచ్చేంత ఎండ కాసింది సరే…మరి వానలు ఆ రేంజ్‌లో పడతాయా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube