కేంద్రం – ఏపీ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూ నిత్యం వేడి రగుల్చుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో అనుకోకుండా విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ మీద కోడి కత్తితో దాడి జరగడంతో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత చిచ్చు పెట్టింది.తప్పు మీది అంటే మీది అంటే మీది అంటూ ఒకరిని ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ఈ వివాదం అలా ఉండాగాయనే… జగన్ పై జరిగిన దాడి కేసును.హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగించింది.
అయితే అంతకు ముందు…కొద్దిరోజుల క్రితమే…కేంద్ర హోం మంత్రిత్వశాఖ.ఎన్‌ఐఏను.
ఈ కేసు విచారణకు పురమాయించింది.వాళ్లు కేసు నమోదు చేసుకుని.
ఎఫ్‌ఐఆర్ కూడా రెడీ చేసుకున్నారు.ఆ విషయాలనే హైకోర్టుకు తెలిపారు.
దీంతో హైకోర్టు ఈ విషయంలో తాము ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చేది ఏముంది …? కేంద్రమే.ఆదేశించింది కదా అంటూ .ఆ రకంగా.ఎన్‌ఐఏ విచారణకు ప్రత్యేకంగా హైకోర్టు ఆదేశాలివ్వకపోయినా.
కోర్టు కూడా అనుమతించిందన్న అర్థాన్ని తీసుకు రాగలిగారు.ఇదే.ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వానికి కోపం తెప్పించింది.శాంతిభద్రతల అంశం.
రాష్ట్రాల పరిధిలోనిది.కేంద్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం.
అయితే.జాతీయ భద్రతతో ముడిపడిన ఉన్న కేసుల విషయంలో జోక్యం చేసుకోవచ్చు.
కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదని.ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విషయాలను కూడా పక్కనపెట్టి కేంద్రం కావాలనే జోక్యం చేసుకుంటూ అనవసర పెత్తనం చేస్తోందని… ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది.
వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
కానీ.ఇలా ఇస్తే.
అది ఏపీ లా అండ్ ఆర్డర్ లో.జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి తమంతట తాము అవకాశం ఇచ్చినట్లు అవుతుందని.అది ఇప్పటికిప్పుడు కాకపోయినా.భవిష్యత్‌లో ఇబ్బందులకు కారణం అవుతుంది అనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.అదే కోర్టు ఆదేశిస్తే.ఏ సమస్యా ఉండదని అనుకుంటున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేయించాలంటూ.జగన్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే.
ఆ ప్రకారం.ముందడుగు వేయాలనుకున్నారు.
కానీ హైకోర్టు నిర్ణయం తీసుకోక ముందే.ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
అది ఏపీ ప్రభుత్వానికి చెప్పలేదు.నేరుగా హైకోర్టులో న్యాయమూర్తికి తెలిపారు.
ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరిగిందని.ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఎన్ఐఏ అధికారులు సొంతంగా విచారణ చేపట్టలేరు.వారు.విశాఖ పోలీసుల నుంచి.విచారణ వివరాలు తీసుకోవాల్సిందే.
అందుకే.ఎన్ఐఏ అధికారులు.
విశాఖ సిట్ అధికారుల్ని సంప్రదించారు.కానీ.
విశాఖ సిట్ అధికారులు మాత్రం.ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండా.
వివరాలను ఇవ్వలేమని స్పష్టం చేశారు.కోడికత్తి కేసుపై కేంద్ర నిర్ణయం రాష్ట్రాధికారాల్లో జోక్యం చేసుకోవడం కిందికే వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ అసమ్మతిని కేంద్రానికి తెలిపేలా లేఖ రాయాలని భావిస్తోంది.ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరేలా కనిపిస్తోంది.