వైరల్‌ : మండిపోతున్న దుబాయిలో ఏసీ లేకుండానే చల్లగా ఉన్న ఇల్లు.. అతడి ఆలోచనకు నెటిజన్స్‌ ఫిదా

గత కొన్ని రోజులుగా అరబ్‌ దేశాల్లో ఎండ ఏ స్థాయిలో ఉందో మనం చర్చించుకుంటూనే ఉన్నాం.అరబ్‌ దేశాల్లో ఉన్న ఎండ వేడికి అక్కడ వాహనాలు పార్క్‌ చేసి ఉన్నా కూడా తగులబడి పోతున్నాయి.

 Heat Resistant House In Saudi Arabia Goes Viral1-TeluguStop.com

ఎండలో అయిదు నిమిషాలు ఉంటే చనిపోయేంత వేడి ఉంది.కొన్ని పదుల సంఖ్యలో జనాలు అక్కడ మృతి చెందారు.

అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్న అరబ్‌ దేశాల్లో 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లుగా స్థానిక వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది.

వైరల్‌ : మండిపోతున్న దుబాయిలో

ఇంత వేసవి కాలంలో కూడా ఒక ఇల్లు చాలా కూల్‌గా ఉంది.ఆ ఇంట్లో ఒక్క ఏసీ ఆన్‌ చేయకున్నా కూడా ఇల్లు చాలా కూల్‌గా చలికాలంలో ఉన్నట్లుగా ఉంది.దానికి కారణం ఆ ఇల్లు అంతా కూడా పచ్చని పొదలను దుప్పటిలా కప్పుకుని ఉండటం.

ఇది అద్బుతంగా అంతా అభివర్ణిస్తున్నారు.ఇలాంటి ఆలోచన ఇతడికి రావడం చాలా అభినందనీయం.

ముందు చూపుతో ఇతడు చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు.ఆ ఇంటి యజమాని ఆలోచనకు అంతా కూడా సెల్యూట్‌ చేస్తున్నారు.

వైరల్‌ : మండిపోతున్న దుబాయిలో

ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు అతడు చేసిన పనిని అభినందించకుండా ఉండలేం.ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ఉష్ణ్రోగ్రతల నేపథ్యంలో ఏసీలను మైనస్‌ డిగ్రీల్లో పెట్టినా కూడా అవి మనిషి తాపంను చల్లార్చడంలో విఫలం అవుతున్నాయి.ఇక వేడికి ఏసీలు కూడా త్వరగా చెడి పోతున్నాయి.దాంతో ఇతడు చేసిన పని గొప్పదని అంతా ప్రశంసిస్తున్నారు.గతంలో కూడా ఇలాంటి ఇళ్లును మనం చూశాం.కాని ఇది ఏకంగా చెట్ల పొదలతో నిండి ఉండటం వల్ల వాటికంటే ఎక్కువగా చల్లదనంను ఇస్తుంది.

ఇలా పొదలు కాకున్నా ఇంటి చుట్టు పచ్చని చెట్లు ఉన్నా చూడా ఇంట్లో ఏసీ అక్కర్లేదు.అందుకే చెట్లు పెంచాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube