ప్రపంచంలో మనం గతంలో ఎప్పుడూ చూడని వింతలు ఈ సంవత్సరం చోటు చేసుకుంటున్నాయి.కొన్ని ఘటనలు వినటానికి నమ్మశక్యంగా లేకపోయినా సాక్ష్యాలు, ఆధారాలు ఉండటంతో నమ్మాల్సి ఉంది.
తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటనలో యువకుడు పామును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.సాధారణంగా పండితులు ఏదైనా దోషం ఉందని చెబితే ఇలా పెళ్లి చేసుకుంటారు.
కానీ ఆ యువకుడు మాత్రం పాముపై ఉండే ఇష్టం వల్లే పెళ్లి చేసుకున్నాడు.
పామును యువకుడు పెళ్లి చేసుకోవడమే వింత అనుకుంటే ఆ యువకుడు పెళ్లి చేసుకున్న పాము విషపూరితమైనది కావడం గమనార్హం.
ఆ యువకుడు పాముతోనే కాపురం చేస్తానని చెప్పడంతో అతని మాటలు విన్నవాళ్లంతా అవాక్కవుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.థాయిలాండ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పామును పెళ్లి చేసుకోవడం గురించి యువకుడు స్పందిస్తూ తనకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదని అకస్మాత్తుగా చనిపోయిన ఆమె మళ్లీ పాము రూపంలో జన్మించిందని యువకుడు చెబుతున్నాడు.
ప్రపంచం ఏమనుకున్నా తాను పట్టించుకోనని.పాముతోనే కలిసి జీవనం సాగిస్తానని చెబుతున్నాడు.ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన తన ప్రేయసి మళ్లీ పాము రూపంలో తిరిగి వచ్చిందని బలంగా నమ్ముతున్నానని అన్నాడు.పాముతోనే కలిసి తినడంతో పాటు టీవీ చూస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సినిమా కథను పోలి ఉన్న ఈ యువకుడి కథ గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆ యువకుడికి సంబంధించి పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
వైద్యులు మాత్రం అతని మానసిక స్థితి సరిగ్గా లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందువల్లే పామును ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.