హార్ట్ బ్రేకింగ్.. పారాగ్లైడింగ్ చేస్తూ జారిపడ్డ యువకుడు మృతి.. వీడియో వైరల్..!

అస్సాంలోని దిబ్రూ సైఖోవా నేషనల్ పార్కులో అక్రమంగా తెరిచిన స్కైల్యాండ్ రిసార్ట్‌లో విషాదం చోటుచేసుకుంది.పంకజ్ గొగోయ్ అనే ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశం పైనుంచి కింద పడ్డాడు.

 Heart Breaking Young Man Who Slipped While Paragliding Died  Video Viral, Heart-TeluguStop.com

అయితే అతడు 200 అడుగుల ఎత్తు పై నుంచి జారి కింద పడడంతో స్పాట్ లో మృత్యువాత పడ్డాడు.దీనికి సంబంధించిన వీడియోని ప్రీతం అనే ఒక జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు గమనించవచ్చు.ఈ పారాగ్లైడింగ్ లో ఎగిరేందుకు వీలుగా ఒక్క వింగ్ తప్ప మిగతా సేఫ్టీ వస్తువులు ఏమీ కనిపించలేదు.

ఒక సీటు, కింద పడిపోకుండా బెల్టు, ఒక గైడ్ మనతోపాటే ఉంటే తప్ప పారాగ్లైడింగ్ చేయకూడదు.ఒకవేళ ప్రావీణ్యం సంపాదిస్తే సింగిల్ గా కూడా పారాగ్లైడింగ్ చేయొచ్చు.

అనుభవం ఉన్నా కూడా సేఫ్టీ కోసం అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.అయితే వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం ఎలాంటి బెల్టులు నడుంకి కట్టుకోలేదు.

ఒట్టి చేతులతో తాళ్లు పట్టుకొని వింగ్ తో సహా గాల్లోకి విహరించాడు.అయితే ఈ పారాగ్లైడింగ్ క్షణాల్లోనే ఆకాశంలోకి చాలా ఎత్తుకు ఎగిరింది.

ఈ క్రమంలోనే ఎలాంటి సపోర్టు లేక పోవడంతో సదరు వ్యక్తి తాళ్లుపై పట్టు తప్పి ఒక్కసారిగా కింద పడిపోయాడు.అంతే అతని ప్రాణాలు క్షణాల్లోనే గాలిలో కలిసిపోయాయి.

ఈ విషయాన్ని ప్రీతం అనే జర్నలిస్టు వెల్లడించాడు.దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.అయితే ఇది వెంటనే వైరల్ గా మారింది.గైడర్ లేకుండా ఇలాంటి పిచ్చి పనులు ఎలా చేస్తారు? అని చాలామంది నెటిజన్లను అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి ప్రమాదకరమైన పారాగ్లైడింగ్ చేయించే యజమానులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు.అసలు ఇది పారాగ్లైడింగ్ కాదని.

ఇది తెలివి తక్కువ తనమని.ఇలాంటి పిచ్చి పనులు ఎలా చేస్తారని మరికొందరు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.

ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube