టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) బెయిల్ రద్దు పిటిషన పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు( AP Skill Development Case )లో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ కోర్టు( AP CID Court )లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని ఏపీ ప్రభుత్వం( AP Govt ) తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.అయితే దీనిపై చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా స్పందిస్తూ చంద్రబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించడం లేదని చెప్పారు.
ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.