ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.భార్య అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.
ఈ క్రమంలో సిసోడియా పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రేపటి లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకు ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం సిసోడియా పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.