ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాలనీ గురించి విన్నారా? ఒక బంగ్లా రూ.200 కోట్లు!

అవును, మీరు విన్నది నిజమే.ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో ఎలాగైనా జీవించాలని ప్రతి ధనవంతుడు కలలుకంటూ ఉంటాడు.

 Heard Of The Most Expensive Colony In The World? A Bungalow Is Rs.200 Crores Exp-TeluguStop.com

దానికోసం ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు.ఇక ఆచోట లభించే ఇళ్ల ధర రూ.కోట్ల నుంచి బిలియన్లలో ఉంటుందనే విషయం మీకు తెలుసా? సగటు మధ్యతరగతి వాడి ఊహకే అందని ధరలు అవి.అందుకే అవి ధనవంతుడి కలలుగా చెప్పుకుంటున్నాము.ఇపుడు అటువంటి ఓ కాలనీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దుబాయ్( Dubai )… ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన, గొప్ప నగరాలలో దుబాయ్ ఒకటి.మరీ ముఖ్యంగా అక్కడ సముద్ర తీరంలో ఉన్న ‘పామ్ జుమేరా( Palm Jumeirah )’ అనే పర్యాటక ప్రాంతం గురించి చెప్పుకోవాలి.దీనిని తాటి చెట్టు ఆకారంలో మనుషులు నిర్మించిన కృత్రిమ ద్వీపంగా పేర్కొంటారు.

విలాసవంతమైన హోటళ్లు, బీచ్‌లు, బంగ్లాలకు పామ్ జుమేరా ప్రసిద్ధికెక్కింది.ఇక్కడ దాదాపు 80,000 మందికి వసతి సదుపాయం ఉంది.

అయినప్పటికీ మీరు ఇక్కడ సులభంగా తిరగగలరు.కానీ ఇక్కడ స్థిరపడటం అనేది మాత్రం చాలా కష్టం.

ఎందుకంటే, ఇక్కడ ఒక విల్లా ధర దాదాపు రూ.200 కోట్లు పై మాటే. 2BHK అపార్ట్‌మెంట్‌ని కొనాలంటే సుమారు రూ.27 కోట్లు కావాలి.ఈ కృత్రిమ ద్వీపం 560 హెక్టార్లలో అంటే దాదాపు 1,380 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఇక పామ్ జుమేరాలో ప్రపంచం నలుమూలలకు చెందిన ధనవంతుల గృహాలు ఉన్నాయి.

ఈ లిస్టులో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సినీ తారలు, అనేక మంది బిలియనీర్ ఉన్నారు.

దీని నిర్మాణ సమయంలో… దీన్ని శాటిలైట్స్( Satellites ) ఫొటోలు తీశాయి.ఇప్పుడు కూడా సముద్రంలో తయారైన ఈ మానవ నిర్మిత ద్వీపం… అంతరిక్షం నుంచి కనబడడం విశేషంగా చెప్పుకుంటారు.పామ్ జుమేరా నిర్మాణం 2001లో మొదలై 20 సంవత్సరాలకు పూర్తయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube