బ్లూటూత్ హెల్మెట్ గురించి విన్నారా? ధర తక్కువ, దిమ్మతిరిగే ఫీచర్లు!

బ్లూటూత్ హెల్మెట్ ఏమిటని ఆశ్చర్యపోవద్దు! ఈ స్మార్ట్ యుగంలో ఏదన్నా స్మార్ట్ గానే ఉంటుంది మరి.హెల్మెట్ ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Heard Of Bluetooth Helmet? Low Price, Amazing Features, Bluetooth Helmet, Techno-TeluguStop.com

సుదీర్ఘ ప్రయాణంలో బైక్ నడిపేవారికి హెల్మెట్ తప్పనిసరి.ఎందుకంటే అనుకోని ప్రమాదాలు చోటుచేసుకున్నపుడు మన ప్రాణాలు కాపాడేవి ఇవే.అందుకే పోలీస్ శాఖ వారు హెల్మెట్ ధరించమని పదేపదే చెబుతూ వుంటారు.అయితే నేటి దైనందిత జీవితంలో ఇలాంటి హెల్మెట్స్ వలన కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వున్నాయి.

Telugu Latest, Ups-Latest News - Telugu

ముఖ్యంగా హెల్మెట్ ధరించిన తరువాత మన అవసరమై వెనక కూర్చున్న వారితో మాట్లాడాలన్నా, లేదంటే వారు మాట్లాడినా, లేదంటే అర్జంట్ కాల్స్ మాట్లాడాల్సి వచ్చినా కాస్త కష్టంగా ఉంటుంది.అయితే ఇపుడు అలాంటి రిస్క్ తీసుకోవలసిన పనిలేదు.ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్లు మార్కెట్లోకి వచ్చేసాయి.అందులో మీరు పిలియన్ సీటులో కూర్చున్న ప్రయాణీకుడితో హాయిగా మాట్లాడవచ్చు.అదేవిధంగా ఎలాంటి కాల్ అయినా అటెండ్ చేయొచ్చు.ఓ రకంగా చెప్పాలంటే ఇది కార్యాలయంలో ఇంటర్‌కామ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఈ హెల్మెట్ పనిచేస్తుంది.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఈ హెల్మెట్ లోపల, చెవి దగ్గర రెండు చిన్న స్పీకర్లను మరియు నోటి దగ్గర ఒక చిన్న మైక్ అమర్చారు.ఇలాంటి ఓ రెండు హెల్మెట్‌లు బ్లూటూత్ ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేస్తే, ఇద్దరూ ఇంటర్‌కామ్ లాగా ఒకరితో ఒకరు తేలికగా మాట్లాడుకోవచ్చు.ఇంకా ఈ హెల్మెట్‌ని కలిగి వున్నపుడు మీ మొబైల్‌కి కనెక్ట్ చేసి ఉంటే, మీరు ఏ కాల్‌ను మిస్ చేయలేరు.డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ చేయడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ, ఇది ధరించినప్పుడు మాట్లాడడం అంత ప్రమాదమేమీ కాదు.

ఈ హెల్మెట్ ఒకేసారి 6 మంది వ్యక్తులను కనెక్ట్ చేయవచ్చు మరియు ఇంటర్‌కామ్ లాగా మాట్లాడవచ్చు.అంతేకాకుండా దీని పరిధి 800 నుండి 1200 మీటర్ల వరకు కనెక్ట్ చేస్తుంది.బొగోట్టో కంపెనీకి చెందిన ఈ హెల్మెట్ ధర రూ.14800.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube