పుదీనా వలన ఎన్ని ఉపయోగాలో     2016-08-18   05:31:19  IST  Lakshmi P

పుదీనా అనేది మెంథా జాతికి చెందిన ఒక ఆకుకూర. పుదీన ఆకుల్లో ఔషధ గుణాలు బాగా ఉంటాయి. అందుకే పుదీనా ఫ్లేవర్ తో జ్యుస్, టీ మాత్రమే కాకుండా బ్యూటి ప్రాడక్ట్స్ కూడా తయారుచేస్తున్నారు. ఈ ఔషధనిధి పుదీనా వలన కలిగే ఉపయోగాలేంటో ఓసారి చదివి తెలుసుకోండి.

* గర్భంతో ఉన్న స్త్రీలు పుదీనా, నిమ్మ, తేనె కలుపుకోని, ఒక జ్యూస్ లా చేసుకోని రోజు తాగితే వాంతులు, వికారం రాకుండా అడ్డుకోవచ్చు.

* పుదీనాలో యాంటిఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రింట్స్ అధికంగా లభిస్తాయి. ఇవి జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తాయి. కడుపులో మంట, ఎసిడిటి వంటి సమస్యలతో పోరాడటానికి కూడా పుదీనా పనికివస్తుంది.

* ఎప్పుడైనా గమనించారా ? నొప్పులకి రాసుకునే బామ్ లో పుదీనా ఫ్లేవర్స్ ఉంటాయి. పూర్తిగా పుదీనా మీద ఆధారపడ్డ బామ్స్ చాలావరకు మార్కెట్లో దొరుకుతాయి. ఎందుకంటే నొప్పి కలిగిన ప్రదేశాన్ని చల్లబరిచే శక్తి పుదీనాలో ఉంటుంది.

* మొటిలకు, ఇతర చర్మ సమస్యలకు పుదీనా వాడటం చక్కటి పరిష్కార మార్గంగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే యాంటి ఇంఫ్లేమేటరి, యాంటి బ్యాక్టీరియా లక్షణాలు, సాలిసిలిక్ ఆసిడ్ మొటిమలతో పోరాడతాయి.

* నోటి దుర్వాసన, నోట్లో ఇంఫెక్షన్స్ కి పుదీనా చక్కటి మందు.

* పుదీనాలో విటమిన్ సి, డి, ఈ, కాల్షియం, ఫాస్ ఫరస్ ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

* పుదీనాలో దొరికే ఫైటోకెమికల్ పొటెంట్ క్యాన్సర్ తో పోరాడే బలాన్ని కలగి ఉంటుంది.

* కండరాలకి హాయిని కలిగించటంలో పుదీనాకి పుదీనే సాటి. ఇది పిరియడ్స్ లో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.