గాడిద పాలు మనలో చాలామంది తాగి ఉండరు.కాని ఒక్కసారి గాడిద పాలతో దొరికే లాభాలు తెలిస్తే వెంటనే తాగడం ప్రారంభిస్తారేమో.
గాడిద పాల రేటు ఎక్కువగానే ఉంటుంది.ఎందుకంటే ఆవుపాలు కన్నా గాడిదపాలు మిన్న.
నమ్మలేకపోతే విషయం పూర్తిగా చదవండి.
* గాడిదపాలలో ప్రోటీన్లు, ఫాస్పోలిఫిడ్స్ మరియు సెరమైడ్స్ ఉంటాయి.
ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచివి.
* ఆవు పాలతో పోల్చుకుంటే, గాడిద పాలలో 60% ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.
ముఖం కాంతివంతంగా మారడానికి ఈజీ మార్గం గాడిద పాలు.
* విటమిన్ సి మాత్రమే కాదు, ఆవుపాలతో పోల్చుకుంటే రెండు రేట్లు ఎక్కువ న్యూట్రింట్స్ గాడిదపాలలో లభిస్తాయి.
మెటాబాలిజం వేగవంతం అవడానికి ఎంతో ఉపయోగకరం గాడిద పాలు.
* గాడిద పాలలో యాంటి ఇంఫ్లేంటరి గుణాలు ఎక్కువ.
డైయిరి మిల్క్ పక్కన పెట్టి గాడిద పాలు తాగడం భేషుగ్గా అలవాటు చేసుకోవచ్చు.
* గాడిద పాలు చర్మాన్ని మైశ్చరైజ్ చేస్తుంది.
మార్కెట్లో దొరికే ఎన్నోరకలా స్కిన్ క్రీమ్స్ కన్నా ఎన్నోరేట్లు ప్రభావంతమైనది గాడిదపాలు.ముఖాన్ని మృదువుగా, లేతగా మార్చడానికి దీన్ని మించిన మార్గం లేదు.
* గాడిదపాలలో ఫాటి ఆసిడ్ శాతం కూడా బాగానే ఉంటుంది.ఇది కురుల సౌందర్యానికి గొప్ప బహుమతి.