కో వ్యాగ్జిన్ వద్దంటున్న వైద్యులు.. కారణం?- Health Workers Not Prefer To Get Covaxin

Health Workers Not Preferring Covaxin Vaccine, Covaxin Vaccine, Health Workers,Covid, Corona Vaccine, Anganwadi Workers Meeting - Telugu Anganwadi Workers Meeting, Britain, Corona Vaccine, Covaxin, Covaxin Vaccine, Covid, Health Workers, Health Workers Not Preferring Covaxin Vaccine, Viral In Internet

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు.కానీ వ్యాక్సిన్ అందుబాటులో కి వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు.

 Health Workers Not Prefer To Get Covaxin-TeluguStop.com

ఇప్పటికే కరుణ వ్యాక్సిన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే గొప్ప వ్యక్తులు, ముఖ్య హోదాల్లో ఉన్న వారు, పరపతి కలవారు పోటీలు పడి మరీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని పోటీ పడ్డారు.

కానీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ను డాక్టర్లు సైతం వద్దు అంటున్నారు.దీని గురించి తెలుసుకుందాం.

 Health Workers Not Prefer To Get Covaxin-కో వ్యాగ్జిన్ వద్దంటున్న వైద్యులు.. కారణం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా వ్యాక్సిన్ వచ్చిన తరువాత కథ మరోలా ఉంది.ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు, వేయించుకోవాల్సిన వారు బాధితుల్లా ఫీలవుతున్నారు.ఇప్పటికే పలుచోట్ల అంగన్వాడీ కార్యకర్తల మీటింగ్ లకు అని పిలిచి వారికి వ్యాక్సిన్ వేయిస్తున్నారు.వారిలో కొందరు తప్పక వ్యాక్సిన్ వేయించుకున్నారు.

వారిలో కొంతమంది భయం భయంగా ఉంటున్నారు అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.ఇప్పటివరకు చాలా చోట్ల కోవిషీల్డ్ మాత్రమే వాడుతున్నారని ప్రచారాలు వస్తున్నాయి.

బ్రిటన్లో రూపొందిన ఈ వ్యాక్సిన్ ను ఇండియా లోనే తయారుచేసి వాడుతున్నారు.ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి డాక్టర్లు ముందుకు రాకుండా ఉన్నారు.దీనికి సంబంధించి ఎకనామిక్స్ టైం లో ఒక ఆసక్తిదాయకమైన ఆర్టికల్ ప్రచురితమైంది.ఒక దేశంలోని ప్రధాన నగరాల్లో రెండు ప్రధాన హాస్పిటల్లో కో వ్యాగ్జిన్ ను అందుబాటులోకి ఉంచారు.

ఆ ఆస్పత్రి సిబ్బంది కోసం వాటిని అందుబాటులోకి ఉంచగా ఆ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు.

విషయంలోకి వెళితే ముంబైలోని జేజే హాస్పిటల్ కు కో వ్యాగ్జిన్ చేరి పది రోజులు గడిచినా వ్యాక్సిన్ తీసుకున్నవారు సంఖ్య కేవలం 111 మాత్రమే అంటే ఆశ్చర్యం వేస్తుంది.

వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా కూడా వేయించుకోవడానికి వారు వెనకాడుతున్నారు అన్న వైనం స్పష్టమవుతోంది.జేజే హాస్పటల్లో 111 మంది అయినా కోవాగ్జిన్ వేయించుకున్నారు.

ఇక ఎయిమ్స్ హాస్పటల్ విషయానికొస్తే ఆ వ్యాక్సిన్ ను తమ సిబ్బందికి ఇవ్వడానికి యాజమాన్యమే నో అని తెగేసి చెప్పినట్లు ఎకనామిక్స్ టైం పేర్కొంది.కోవిషిల్డ్ ఇస్తే తాము వేసుకోవడాన్ని రెడీ అని, కో వ్యాక్సిన్ అయితే వేసుకోవడానికి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇది కరోనా కు విరుగుడు తయారైన దేశ పరిస్థితి.

#HealthWorkers #Health Workers #COvid #Corona Vaccine #Covaxin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు