సర్వే : వారానికి 3 నుండి 6 కోడిగుడ్లతో మీ గుండె పదిలం

ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది అనేది తెల్సిందే.ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్‌ తినాలి.

 Weekly 3 To 6 Eggs Is Very Use Full To Health Say China University, Health Food,-TeluguStop.com

హెల్తీ ఫుడ్‌ అంటే ఏంటీ అనే విషయమై పలువురు పలు రకాలుగా చెబుతూ ఉంటారు.కొందరు గుడ్లను ఆరోగ్యానికి మంచిది అంటూ చెబుతూ ఉంటే కొందరు మాత్రం గుడ్లు ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాలను ప్రచారం చేస్తూ ఉంటారు.

అసలు విషయం ఏంటీ అంటే వయసును బట్టి కోడి గుడ్లను తీసుకోవాలని, మోతాదులో గుడ్లను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని తాజాగా చైనా యూనివర్శిటీకి చెందిన వైధ్యులు నిర్ధారించారు.

గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో చైనా సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.ఆ సర్వేలో వారు పలు ఆసక్తికర విషయాలను తెలియజేయడం జరిగింది.ఈ సందర్బంగా వారు చెప్పిన విషయాల ప్రకారం ప్రతి వారం మూడు నుండి ఆరు గుడ్లను తిన్న వారికి ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి.

ప్రస్తుతం కోడి గుడ్లను అధికంగా వినియోగిస్తున్న వారు భవిష్యత్తులో గుండెకు సంబంధించిన సమస్యల నుండి బయట పడతారు అంటున్నారు.

ఆ సర్వే ప్రకారం పది సంవత్సరాల లోపు పిల్లలు వారంలో నాలుగు నుండి ఏడు గుడ్లు తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

10 నుండి 20 ఏళ్ల లోపు వారు వారంలో రోజుకు ఒకటి చొప్పున కోడి గుడ్లను తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు అని తేల్చి చెప్పారు.

ఇదే సమయంలో వయసుకు మించి బరువు ఉన్న వారు కోడి గుడ్లను కాస్త తగ్గించి తింటే మంచిదనే అభిప్రాయంను కూడా ఆ సర్వేలో వెళ్లడి చేయడం జరిగింది.

వయసు పై బడిన వారు కూడా తప్పకుండా కోడి గుడ్లు తినాలని, అయితే వారు వారంలో మూడు లేదా నాలుగు కోడి గుడ్లు తినవచ్చు అని, అది కూడా వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి తినాలంటూ పేర్కొనడం జరిగింది.

మొత్తానికి కోడి గుడ్లు తినాలంటూ ఆ సర్వే తర్వాత యూనివర్శిటీకి చెందిన వారు చెబుతున్నారు.

సర్వే ఫలితాల నేపథ్యంలో అక్కడి వారికి కూడా కోడి గుడ్ల గురించి అధిక ప్రచారం కలిగించాలని భావిస్తున్నారు.

Weekly 3 To 6 Eggs Is Very Use Full To Health Say China University, Health Food, Eggs, Heart Attack, Health Benfits, Heart Problems, Weekly 3 Or 6 Eggs - Telugu Eggs, Benfits, Heart Attack, Heart Problems, Weekly Eggs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube