తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ.. ?

కరోనా ఫస్ట్ వేవ్ నుండి దాదాపుగా మన దేశ ప్రజలు తప్పించుకున్నారు.కానీ సెకండ్ వేవ్ మాత్రం ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులను నమోదు చేసుకుంటూ వెళ్లుతుంది.

 Health Emergency In Telangana, Telangana, Health Emergency, Medical Staff, Leave-TeluguStop.com

గత కొన్ని నెలల క్రితం వరకు తెలంగాణ బార్డర్లో ఉన్న కరోనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిస్తుంది.

రాష్ట్రంలో వేలల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో వైద్యారోగ్య అప్రమత్తమైంది.

కరోనా మొదటి వేవ్‌ కంటే సెకండ్ వేవ్ సీరియస్‌గా ఉందన్న అంచనాకు వచ్చిన వైద్యారోగ్య శాఖ వైద్య ఆరోగ్య వ్యవస్థను అప్రమత్తం చేసింది.అదీగాక ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం తప్పనిసరి అనే అభిప్రాయంతో మాస్కులు ధరించనివారిపై కేసులు కూడా నమోదు చేయడం తీవ్రతరం చేసింది.

ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సెలవులను ఆకస్మికంగా రద్దుచేసి హెల్త్ ఎమర్జెన్సీ విధించింది.ఇక కోవిడ్‌ను తరిమి కొట్టాలంటే ప్రజలు కూడా సహకరించాలని విన్నవిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube