భారత్ లో  హెల్త్ ఎమర్జెన్సీ  ? కేంద్రం తీరుపై అనుమానాలెన్నో ? 

కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగిపోతోంది.ముందు చూపుతో కరోనా ను అరికట్టడానికి కానీ, ప్రజలను అప్రమత్తం చేయడం కానీ,  ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడంలో గానీ,  కేంద్రం విఫలమైందని ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

 Health Emergency In India Doubts About The Center Government Bharath , Carona ,-TeluguStop.com

  అదీ కాకుండా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ విషయాలన్నీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయాలే.

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతంగా ఉన్న దేశాలలో భారత్ రెండో స్థానంలో ఉంది.ఇది మొదటి స్థానానికి చేరేందుకు మరెంతోకాలం పట్టదు అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి నెలకొంది.

  దాదాపు మూడున్నర లక్షలకు పైగా నిత్యం ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ, అంతే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి.

అధికారికంగా బయటకు రాని ఎన్నో కరోనా కేసులు , మరణాలు దేశవ్యాప్తంగా సంభవిస్తున్నాయి .దీంతో కేంద్రం తీరుపైనే విమర్శలు వస్తున్నాయి.  ప్రపంచ దేశాలు సైతం భారత్ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.అయితే ఇదంతా మీడియా,  సోషల్ మీడియా ద్వారా భారత్ లో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏమిటనేది ప్రపంచానికి తెలుస్తోంది.

  అంతో ఇప్పుడు వాటిపై నియంత్రణ పెట్టే విధంగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.అలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడుతూ ఉండటం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం, దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Bharath, Carona, Covid, Emergency, India-Telugu Political News

అసలు ఈ హెల్త్ ఎమర్జెన్సీ విధించడం వల్ల ఆక్సిజన్ , ఔషధాల ఉత్పత్తి , సరఫరా, వినియోగం , ఇలా చాలా అంశాలే కేంద్రం నియంత్రణలోకి వస్తాయి.ఇదే చట్టం కింద మీడియా పై నియంత్రణ తో పాటు , ఇష్టానుసారం కేంద్రం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వచ్చే వార్తలపై  కేసులు పెట్టి ,అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా ,  కేంద్రంపై ఎవరు విమర్శలు చేయకుండా కట్టుదిట్టం చేసే అవకాశం ఏర్పడుతుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గం గా కేంద్రం  అభిప్రాయపడుతోంది అనే వార్తలు జోరందుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube