మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత చిట్కాలు..!

మారుతున్న కాలంతో పాటు మనిషి ఆరోగ్యం కూడా మరింత క్షీణిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడకం పెరిగిపోయిన తర్వాత జనాలు తమ ఆరోగ్యాన్ని మరింత నిర్లక్ష్యం చేస్తున్నారు.

 Health Care, Health Tips, Healthy Foods, Benifit, Tips, Eye Care-TeluguStop.com

దేవుడు ప్రసాదించిన గొప్ప వరాల్లో నేత్రాలు ఒకటైతే.వాటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎవరూ కూడా శ్రద్ధ చూపించడం లేదు.గంటలతరబడి మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం హాబీగా మార్చుకుంటున్న వారెందరో.దీనివల్ల వారికి తెలియకుండానే వారి కళ్ల ఆరోగ్యం సర్వనాశనం అవుతుంది.ఈ నేపథ్యంలో వైద్యులు హానికరమైన అలవాట్లను వీడి.తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

Telugu Benifit, Eye Care, Care, Tips, Healthy Foods-General-Telugu

కళ్లల్లో మంట పుట్టడం, దురద పెట్టడం, మసకబారడం వంటి సమస్యలన్నీ కళ్లు పొడిబారడాన్ని సూచిస్తాయి.ఈ సమస్య అధికమైతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఈ సమస్యను మొగ్గలోనే అంతం చేయాలంటే సీ విటమిన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

టీవీలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లముందు ఎక్కువసేపు కూర్చోకూడదు.ఒకవేళ పనిలో భాగంగా డిజిటల్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూడాల్సి వస్తే.మధ్య మధ్యలో విరామం తీసుకోవడం చాలా ముఖ్యం.అలాగే బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ ధరించడం కూడా మంచిది.

అలాగే బ్రైట్ స్క్రీన్లను వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే చూడాలి.చీకటిగా ఉండే ప్రదేశాల్లో తెల్లగా మెరిసే స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పాడయ్యే ప్రమాదం ఎక్కువ.

అలాగే కొందరు అదేపనిగా కళ్లు ఆర్పకుండా స్క్రీన్ చూస్తుంటారు.దీని వల్ల కంటిలోని తేమ ఆవిరైపోయి కంటి సమస్యలు పెరుగుతాయి.మన కళ్లు ఎప్పుడూ తేమగా ఉంటేనే వాటిపై ఎలాంటి ఒత్తిడి పడదు.అలాగే కళ్లలో ఉండే తేమ కంటిని ఎల్లవేళలా శుభ్రం చేస్తుంటుంది.

ఈ తేమను ఎప్పుడూ కాపాడుకోవాలంటే తరచూ నీరు తాగుతూ ఉండాలి.కంటిలోని తేమ కరువైతే దుమ్ము, ధూళి కారణాల వల్ల కంటి సమస్యలు దరిచేరే ప్రమాదం ఉంది.

Telugu Benifit, Eye Care, Care, Tips, Healthy Foods-General-Telugu

అలాగే ప్రతి గంటకొకసారి కళ్లను నీటితో శుభ్రపరుచుకోవాలి.అయితే నీరు అనేది మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండకూడదు.పుచ్చకాయ వంటి అధిక నీటి శాతం కలిగిన పండ్లను తీసుకోవాలి.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే సాల్మన్‌, ట్యూన్, ట్రౌట్‌ చేపలను తరచుగా తింటుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.అలాగే వేడిగాలులు, చల్ల గాలులను ఉత్పత్తి చేసే కూలర్లు, ఏసీలు, హీటర్లకు మన కళ్లను దూరంగా ఉంచాలి.బయటికి వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించండి.ఎక్కువగా కాఫీ టీలు తాగకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube