గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాయ ఏంటో తెలుసా?

కూరగాయలలో చాలామందికి నచ్చని కాయ కాకరకాయ.ఈ కాకరకాయ చేదుగా ఉండటం వల్ల ఎంతోమంది దీనిని తినడానికి ఇష్టపడరు.

 Health Care For Pregnant Womens Eating Bitter Gourd-TeluguStop.com

కానీ ఈ కాకరకాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయ తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు వైద్యులు.

ఈ కాకరకాయను కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకోవడం మంచిది.

 Health Care For Pregnant Womens Eating Bitter Gourd-గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కాయ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాకరకాయ తినడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఉండే మలబద్ధకం సమస్య, జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

కాకరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకం నుండి ఉపశమనం పొందవచ్చు.సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి వాటిలో జీర్ణక్రియ, మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటాయి.

కాకరకాయ చేదుగా ఉంటుంది అని పైన పీచు తీసి కాకరకాయలు తినడం మంచిది కాదు.ప్రెగ్నెన్సీ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం అవసరం.

పోషకాహారం తీసుకోవడం వలన శిశువు పెరుగుదలకు ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది.కాబట్టి కాకరకాయ పైన పీచు తీయకుండా వండుకోవడం మంచిది.

వారంలో ఒకటి లేదా రెండు సార్లు కాకరకాయ తింటే ప్రగ్నెన్సీ సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టండి.

#Pregnant Womens #EatingBitter #Health Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు