ఆడవారు పట్టీలు ధరించటం వెనక ఉన్న ఆరోగ్య రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు     2017-11-06   23:34:47  IST  Raghu V

ఆడవాళ్ళు కాళ్లకు ధరించే పట్టిలు ఒక నగ. సాధారణంగా వెండితో తయారుచేసిన పట్టీలను వాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న భారతీయ స్త్రీని గుర్తు పట్టవచ్చు. ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి. ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన ఆచారాలు అని అందరు అనుకుంటారు. పూర్వ కాలంలో బయటి పని ఎక్కువ మగవారే చేసేవారు. దాంతో వారికి రక్త ప్రసరణ బాగా జరిగేది. కాని ఆడవారు ఇంట్లో ఎక్కువగా ఉండటం వలన రక్తప్రసరణ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. అప్పటినుంచే ఆక్యుప్రెషర్ టెక్నిక్ మొదలుపెట్టారు. ఈ ఆక్యుప్రెషర్ టెక్నిక్ ద్వారా శరీరంలో కొన్ని చోట్ల ఒత్తిడి పెంచడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

కాలి పట్టీలు ఎప్పుడు కొన్ని నరాలని తాకుతూ ఉండటం వలన రక్త ప్రసరణ సరైన ట్రాక్ లో ఉంటుందని పూర్వ కాలంలో భావించేవారు. వెండితో చేయించే పట్టీలు ఎప్పుడు గలగలా చప్పుడు చేస్తూ ఉంటాయి. దాంతో ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, మహిళలు సంతోషంగా ఉంటే, ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలు అభిప్రాయడేవారు.

ఈ పట్టీల వలన కాళ్ళ ఎముకలు దృడంగా ఉంటాయని, అంతే కాకుండా ఈ ఆక్యుప్రెషర్ వలన రక్త ప్రసరణ బాగా జరిగి మహిళల హార్మోన్స్ సమస్యలు, గర్భ సమస్యలు,నెలసరి సమస్యలు, మూడ్ స్వింగ్ సమస్యలు కంట్రోల్ లో ఉంటాయని కూడా చెబుతారు.