అయ్యప్ప దీక్షలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

  • శబరిగిరుల్లో కొలువున్న హరిహరసుతుడు అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి 41 రోజుల పాటు నియమ నిష్టలతో దీక్షను చేపడతారు. ఈ దీక్ష ఎంతో భక్తి భావంతో చేయాలి. అలాగే చాలా కఠినమైంది. ఈ దీక్షలో భక్తులకు అద్భుతాలు కన్పిస్తాయి. ప్రతి రోజు తెల్లవారు జామున చన్నీటి స్నానము, నేల మీద పడుకోవటం,ఒంటి పుట భోజనం, చెప్పులు ధరించకపోవటం వంటి కఠినమైన నియమాలను అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు పాటిస్తారు. ఈ నియమాల వెనక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

  • తెల్లవారు జామునే లేచి చన్నీటి స్నానం చేయటం వలన శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. అందువల్ల ముఖం ప్రశాంతంగా ఉంటుంది.

  • నేల మీద పడుకోవటం వలన వెన్ను నొప్పి తగ్గటమే కాకుండా కండర పటిష్టతకు దోహదం చేస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగు అవుతుంది.


  • ఈ సమయంలో అందరూ దీపారాధన చేస్తారు. ఆ దీపం కాంతిలో మనస్సు తేలిక పడుతుంది.

  • ప్రతి రోజు క్రమం తప్పకుండా సామూహికంగా పూజలో పాల్గొనటం వలన సంఘజీవనం మరియు క్రమశిక్షణ, ఇచ్చి పుచ్చుకొనే తత్వం పెరుగుతుంది.

  • ఎక్కువగా మాట్లాడటం,వివాదాలకు దూరంగా ఉండటం వలన సమయం ఆదా అయ్యి ఆలోచనాశక్తి పెరుగుతుంది.

  • ఈ దీక్ష 40 రోజులు పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటే ఆ అలవాటు తగ్గే అవకాశం కూడా ఉంది.

  • అలాగే మితాహారం, శాఖాహారం తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.