వారెవ్వా..వాట‌ర్ యాపిల్‌తో అన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్టొచ్చా?

యాపిల్ తెల‌సు, గ్రీన్ యాపిల్ తెలుసు, ఐస్ యాపిల్ కూడా తెలుసు.మ‌రి ఈ వాట‌ర్ యాపిల్ ఏంట‌బ్బా.? అనేగా మీ డౌట్‌.వేస‌విలో విరి విరిగా కాసే ఈ వాట‌ర్ యాపిల్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.

 Health Benefits Of Water Apple Benefits Of Water Apple-TeluguStop.com

చాలామందికి పెద్దగా తెలియని ఈ వాట‌ర్ యాపిల్‌ను వైట్ జామూన్ అని, జంబూ ఫలం అని కూడా పిలుస్తుంటారు.చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉండే ఈ వాట‌ర్ యాపిల్స్ కొంచెం తియ్య‌గా, కొంచెం వ‌గ‌రుగా ఉంటాయి.

ఈ పండ్ల‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది.

 Health Benefits Of Water Apple Benefits Of Water Apple-వారెవ్వా..వాట‌ర్ యాపిల్‌తో అన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్టొచ్చా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక నోట్లో వేసుకున్న వెంటనే క‌రిగిపోయే ఈ వాట‌ర్ యాపిల్స్‌లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

విటమిన్ బి, విట‌మిన్ సి, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు వాట‌ర్ యాపిల్ ద్వారా పొందొచ్చు.అందుకే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Telugu Benefits Of Water Apple, Good Health, Health, Health Benefits Of Water Apple, Health Tips, Latest News, Water Apple, Water Apple For Health-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ముఖ్యంగా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచుకోవాలి అని ప్ర‌య‌త్నించే వారు ఈ వాట‌ర్ యాపిల్‌ను తీసుకోవ‌డం చాలా మంచిది.వాట‌ర్ యాపిల్‌లో ఉండే విట‌మిన్ సి, జింక్ పోష‌కాలు.శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.దాంతో వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల‌కు ఈ వాట‌ర్ యాపిల్ ఓ దివ్యౌషధంగా పని చేస్తుంది.అవును, ఈ పండ్ల‌ను తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

స‌మ్మ‌ర్‌లో ఆ వాట‌ర్ యాపిల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.ఒత్తిడి, మాన‌సిక అందోళ‌న‌, అల‌స‌ట‌, నీర‌సం వంటి స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.

అధిక ర‌క్త పోటును త‌గ్గించ‌డంలోనూ ఈ వాట‌ర్ యాపిల్ స‌హాయ‌ప‌డుతుంది.రెగ్యుల‌ర్‌గా ఒక‌టి చ‌ప్పున ఈ వాట‌ర్ యాపిల్‌ను తీసుకుంటే.

ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

#Health Tips #WaterApple #HealthBenefits #Good Health #Water Apple

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు