రోజుకు కేవ‌లం 20 నిమిషాలు న‌డిస్తే.. ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

నేటి కాలంలో జీవన విధానం యాంత్రికంగా మారడంతో.చాలా మందికి ఎక్సర్ సైజ్ చేసే స‌మ‌య‌మే ఉండ‌డం లేదు.

 Health Benefits Of Walking Twenty Minutes Per Day!! Walking, Health Benefits Of-TeluguStop.com

త‌ద్వారా స్థూలకాయం, బీపీ, షుగర్‌, గుండె పోటు, ఒత్తిడి ఇలా ఎన్నో రుగ్మతల బారిన ప‌డి.నానా ఇబ్బందులు ప‌డ‌ట‌మో లేదా ప్రాణాలు కోల్పోవ‌డ‌మో జ‌రుగుతోంది.

అయితే ఎక్సర్ సైజ్ చేసే స‌మ‌య‌మే లేనివారు.రోజుకు కేవ‌లం 20 నిమిషాలు న‌డిచినా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక వ్యాయామాలన్నింటిలోకి నడక వ్యాయామం ఉత్తమమైనది.నడకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.ప్ర‌తిరోజు ఇర‌వై నిమిషాల పాటు న‌డ‌వ‌డం వ‌ల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.త‌ద్వారా గుండె నొప్పి, ఇతర గుండె జబ్బులు రాకుండా ఉండ‌ట‌మే కాకుండా.

శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

అలాగే అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్న‌వారు.రోజుకు ఇర‌వై నిమిషాల పాటు న‌డిస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ట‌.ఎందుకంటే, న‌డ‌వ‌డం వ‌ల్ల రక్త నాళల్లో రక్త ప్రవాహనికి సరిపోయే ఆక్సిజన్ సప్లే చేస్తుంది.

దాంతో కండరాలు మరింత రిలాక్స్ గా అయ్యి.బ్లడ్ ప్రెజర్ ను అదుపులోకి తెస్తుంది.

ఇక రోజుకు ఇర‌వై నిమిషాలు న‌డ‌వ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అదే స‌మ‌యంలో కీళ్లు దృఢంగా మార‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

నడవడం వల్ల పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది.ఇది ఆ రోజుకి సరిపడా ఉత్సాహాన్ని ఇస్తుంది.

మ‌రియు మెదడు పనితీరును కూడా మెరుగవుతుంది.సో.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, వర్క్ టెన్షన్లలో బీజీ అయినా.ఏదో ఒక రకంగా 20 నిమిషాలు నడిచేందుకు వీలుండేలా చేసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube