`ఆకాకర`తో ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు!

ఆకాకర.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Health Benefits Of Teasel Gourd-TeluguStop.com

పొట్టిగా గుండ్రముగా పై ముళ్ళ లాంటి తోలుతో ఉండే ఆకాక‌ర‌ను.ఆగాకర లేదా అడవికాకర లేదా బోడ కాకర అని కూడా పిలుస్తారు.

చూడటానికి ఇవి కాకరకాయల్లా ఉన్నా.రుచిలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది.

 Health Benefits Of Teasel Gourd-`ఆకాకర`తో ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ధ‌ర కాస్త ఎక్కువ‌గానే ఉండే ఈ ఆకాక‌ర‌.ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అద్భుత‌మైన కూర‌గాయ‌ల్లో ఆకాక‌ర కూడా ఒక‌టి అన‌డంలో సందేహ‌మే లేదు.మ‌రి ఆకాక‌ర ఆరోగ్యానికి చేలు ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల భ‌యంక‌ర క్యాన్సర్ల బారిన పడకుండా రక్షిస్తుంది.

ఆకాక‌ర‌లో ఉండే విట‌మిన్ సి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెంపొందిస్తుంది.

త‌ద్వారా అనేక ర‌కాల వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భించ‌డంతో.దగ్గు, జలుబు, ఇతర అలెర్జీలు కూడా దూరం అవుతాయి.

ఇక ఆకాక‌ర‌లో క్యాలరీలు చాలాతక్కువగా ఉంటాయి.పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి.

ఇవి జీర్ణ‌స‌మ‌స్య‌లు దూరం చేయ‌డంతో పాటు మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య‌ను నివారిస్తుంది.

ఆకాకర రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది.

అందుకే డయాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు ఖ‌చ్చితంగా ఆకాక‌ర‌ను డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే ఆకాక‌ర‌లో ఉండే కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులు రాకుండా ర‌క్షించ‌డంతో పాటు కంటి చూపును మెరుగుప‌రుస్తుంది.

చూసారుగా చిన్నగా ఉండే ఈ ఆకాక‌ర వ‌ల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో.సో.ఈ సీజ‌న్‌లో విరివిరిగా ల‌భించే ఆకాక‌ర‌ను అస్స‌ల మిస్ అవ్వ‌కండి.

#Health #Teasel Gourd #Health Tips #HealthBenefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు