తంగేడు పువ్వుతో ఈ సమస్యలు దూరం  

అడవుల్లో ఉండే అనేకరకాల చెట్లు,పూలు,పండ్లు.ఇలా ప్రతీ చెట్టు మానవ శరీరంలో వచ్చే జబ్బుల్ని తగ్గించే ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటాయి..

-

ఈ కోవకు చెందినదే తంగేడు పూల చెట్టు.ఇది ఎక్కువగా కొండ ప్రాంతలలో ఉంటుంది.ఈ తంగేడు పువ్వు రేకుల కషాయాన్ని తాగితే మధుమేహం రాదు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

తంగేడు పువ్వుల రేకులు, నల్ల వక్కల పొడి ఓ స్పూన్, రెండు గ్లాసుల మంచి నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగడం ద్వారా చక్కెర స్థాయిలు తగ్గుతాయి అని సూచిస్తున్నారు. అతి మూత్రవ్యాధి తగ్గడానికి తంగేడు పూలని నీరెండలో ఎండబెట్టి, దానికి సమానంగా బెల్లం కలుపుకుని ఈ మిశ్రమాన్ని రోజు అరస్పూన్ తీసుకుంటే చాలు. ముప్పై ఏళ్ళు దాటినా వాళ్ళు ఇలా వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచిది.

ఇంకా తంగేడు పువ్వులను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి. అందుకు సమానంగా బెల్లం కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రోజూ అరస్పూన్ తీసుకుంటే అతిమూత్ర వ్యాధి నయం అవుతుంది. ఎండిన తంగేడు పూల కషాయాన్ని రోజుకు ఒక పూట చొప్పున నెలరోజుల పాటు తాగితే, తెల్లబట్ట సమస్య తొలగిపోతుంది. ఇంకా తంగేడు పువ్వుల పొడిని ముల్తానీ మట్టితో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపును సంతరరించుకుంటుంది.

తంగేడు ఆకులు కొన్ని తీసుకుని వాటికి మెంతులు కలిపి మజ్జిగలో మెత్తగా నూరి.తలపై ఉంచి ఆముదం ఆకుతో ఆ మిశ్రమాన్ని కప్పి ఉంచి గంట తరువాత స్నానం చేయాలి ఇలా చేస్తే శరీరం చల్లబడుతుంది.