సోయా పాలలో ఉన్న 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  

సోయా బీన్స్ గింజలను నానబెట్టి మిక్సీ చేసి సోయా పాలను తయారుచేస్తారు. ఈ సోయా పాలలో కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, మాంసకృత్తులు, ఫైబర్ మరియు విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. సోయా పాలు శరీరం యొక్క మంచి పనితీరుకు సహాయపడతాయి. సోయా పాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది


సోయా పాలు కొలెస్ట్రాల్ ని నియంత్రించటంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనిలో ఉండే ప్రోటీన్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి మరియు మంచి కొలెస్ట్రాల్ ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఆవు పాలు కన్నా సోయా పాలు తీసుకుంటేనే చెడు కొలస్ట్రాల్ తగ్గుతుందని ఒక అధ్యయనంలో తెలిసింది.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది


సోయా పాలను ఖచ్చితమైన ఆరోగ్యకర ఆహారంగా చెప్పవచ్చు. ఈ పాలను మరిగిస్తే పోషక విలువలు ఏ మాత్రం కోల్పోవు. లాక్టోజ్ పడని వారికి ఇది బాగా సహాయపడుతుంది. పాలలో ఉండే చక్కెరలను జీర్ణం చేయటంలో సహాయపడుతుంది.

3. బరువు నిర్వహణ


బరువు తగ్గాలని అనుకొనే వారికి సోయా పాలు ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉన్న సోయా పాలను వెయిట్ లాస్ ఆహార ప్రణాళికలో చేర్చితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోయా పాలలో క్యాలరీలు మరియు చక్కెర కంటెంట్ తక్కువగా ఉంటుంది. అంతేకాక సోయా పాలలో ఉండే కొవ్వు ఆమ్లాలు ప్రేగుల్లో ఉండే కొవ్వును శోషిస్తాయి.

4. ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి ఉపశమనం


ప్రపంచ వ్యాప్తంగా ఒక సాదారణ వ్యాదిగా మారిన ప్రోస్టేట్ క్యాన్సర్ ని నివారించటంలో సోయా పాలు సహాయపడతాయి. సోయా పాలలో ఫోటో ఈస్ట్రోజెన్ హార్మోన్ సమృద్దిగా ఉంటుంది. పురుషుల్లో ఈ హార్మోన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. పురుషుల్లో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నిరోధించవచ్చు. సోయా పాలను క్రమం తప్పకుండా తీసుకొనే పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.

5. మెనోపాజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది


మహిళలకు మెనోపాజ్ సమయంలో గుండె వ్యాధులు, మధుమేహం, ఊబకాయం మరియు కీళ్ళ నొప్పుల వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఆరోగ్య సమస్యల కారణంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు సోయా పాలను తీసుకోవటం అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే సోయా పాలలో ఉండే ఫోటో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఈస్ట్రోజెన్ ను భర్తీ చేస్తుంది.