ఇమ్యూనిటీని పెంచే సీమ చింతకాయ..ఎలా తీసుకోవాలంటే?

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మునుప‌టితో పోలిస్తే మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మాయ‌దారి వైర‌స్‌.

 Health Benefits Of Seema Chintakaya-TeluguStop.com

ప్ర‌తి రోజు వేల మందిని మింగేస్తుంది.ఈ క్ర‌మంలోనే ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నెల‌కొంటున్నాయి.

ఎంద‌రో అనాథులుగా దిక్కుతోచ‌ని స్థితిలో మిగులుతున్నారు.అందుకే క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు అంద‌రూ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచే ఆహారాల‌ను తీసుకుంటున్నారు.

 Health Benefits Of Seema Chintakaya-ఇమ్యూనిటీని పెంచే సీమ చింతకాయ..ఎలా తీసుకోవాలంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో సీమ చింత‌కాయ‌లు కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

వేస‌వి కాలంలో ఎక్క‌డ చూసినా సీమ చింత‌కాయ‌లే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.

వీటిని శుభ్రం చేసుకుని డైరెక్ట్‌గా తినేయ‌వ‌చ్చు.లేదంటే క‌ర్రీ రూపంలోనూ తీసుకోవ‌చ్చు.

గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ సీమ చింత‌కాయ‌లు కాస్త తియ్య‌గా, కాస్త వ‌గ‌రు ఉంటాయి.అలాగే వీటిలో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు నిండి ఉండే సీమ చింత‌కాయ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాలి అని భావించే వారు ప్ర‌తి రోజు ఒకటి, రెండు చ‌ప్పున సీమ చింత‌కాయ‌ల‌ను తీసుకోవాలి.

Telugu Benefits Of Seema Chintakaya, Good Health, Health, Health Tips, Immune System, Immunity Power, Increase Immunity Power, Latest News, Pressure, Protect From Corona, Proteins, Seema Chintakaya, Tamarind, Tension, Vitamins-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇలా చేస్తే వాటిలో ఉండే విట‌మిన్ సి మ‌రియు ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ను బ‌ల‌ప‌రుస్తాయి.దాంతో వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.అలాగే సీమ చింత‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో సీమ చింతకాయ‌లు తీసుకుంటే.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అతి ఆక‌లి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అదేవిధంగా, వెయిట్ లాస్ కూడా అవుతాయి.

#Vitamins #Immunity Power #Tamarind #Health #Pressure

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు