రోజుకు ఐదు నిమిషాలు ర‌న్నింగ్ చేస్తే ఆ స‌మ‌స్య‌లు దూరం!  

నేటి ఉరుకుల పరుగుల జీవన విధానం చాలా మందికి వ్యాయామం చేసే ఖాళీనే ఉండ‌డం లేదు.ఫ‌లితంగా ముప్పై ఏళ్ల‌కే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త పోటు, అధిక బ‌రువు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు చుట్టు ముట్టేస్తుంటాయి.

TeluguStop.com - Health Benefits Of Running Five Minutes A Day

ఆహారం విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.వ్యాయామం చేయ‌కుంటే ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య బారిన ప‌డాల్సిందే.

అయితే ప్ర‌తి రోజు గంట‌ల‌కు గంట‌లు శ్ర‌మించి వ్యాయామాలు చేయాలేక‌పోయినా.క‌నీసం ఐదు నిమిషాల పాటు ర‌న్నింగ్ చేస్తే బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

TeluguStop.com - రోజుకు ఐదు నిమిషాలు ర‌న్నింగ్ చేస్తే ఆ స‌మ‌స్య‌లు దూరం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

అధిక బ‌రువును త‌గ్గించ‌డంలో ర‌న్నింగ్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఇక బరువు తగ్గడానికి చాల రకాల వ్యాయామాలు ఉన్న‌ప్ప‌టికీ.సులువుగా చేయ‌గ‌లిగేది కూడా ర‌న్నింగ్‌నే.

అయితే ప్ర‌తి రోజు ఐదు నిమిషాల పాటు ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా ఉన్న కేల‌రీల‌ను క‌రిగించి.స‌న్న‌గా, నాజుకుగా అయ్యేలా చేస్తుంది.

వాకింగ్ కంటే ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల‌నే కేల‌రీలు త్వ‌ర‌గా క‌రిగిపోతాయి.అలాగే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ ప‌డేవారు రోజుకు ఐదు నిమిషాలు ర‌న్నింగ్ చేస్తే.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి.

అలాగే రోజుకు ఐదు నిమిషాల పాటు ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నం ఏంటంటే.శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.దాంతో జ‌లుబు, దగ్గు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

ఇక నేటి కాలంలో పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు కామ‌న్‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య ఒత్తిడి.అయితే రెగ్యుల‌ర్‌గా ఐదు నిమిషాల పాటు ర‌న్నింగ్ చేస్తే.ఒత్త‌డి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

అదేవిధంగా, ప్ర‌తి రోజు ఐదు నిమిషాల పాటు పచ్చని ప్రకృతి ఉన్న పరిసరాల్లో ర‌న్నింగ్ చేస్తే. రక్తప్రసరణ మెరుగుప‌డి ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.మ‌రియు గుండె జ‌బ్బులు దూరంగా ఉంటాయి.

ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా క్ర‌మంగా త‌గ్గిపోతుంది.ఇక ప్ర‌తి రోజు ఉద‌యం కేవ‌లం ఐదు నిమిషాలు ర‌న్నింగ్ చేస్తే బ్రైన్ షార్ప్‌గా ప‌ని చేయ‌డంతో పాటు.

రోజంతా ఉల్లాసంగా ఉంటారు.

#Health Tips #FiveMinutes #Good Health #Running #BenefitsOf

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు