కోసిన ఉల్లిపాయను రాత్రంతా గదిలో ఉంచితే ఏమి జరుగుతుందో తెలుసా?  

Health Benefits Of Raw Onions -

ఉల్లిపాయను కూరల్లో వేస్తె ఆ రుచే వేరు.ఉల్లిపాయ చేసే మేలు తల్లి కూడా చేయదని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు.

ఉల్లిపాయ వంటల్లో ఉపయోగించటం కాకుండా అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి

Health Benefits Of Raw Onions-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

చాకు తుప్పు పట్టినప్పుడు తుప్పు పట్టిన ప్రదేశను ఉల్లిపాయ ముక్కతో రుద్దితే తుప్పు తొందరగా పోతుంది

రూమ్ లో కొత్తగా పెయింట్ వేసినప్పుడు వాసన రావటం సహజమే.ఆ వాసన పోవాలంటే ఆ గదిలో ఒక బోనులో నీటిని పోసి దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రంతా ఉంచితే వాసన పోతుంది


మొటిమలు తొందరగా తగ్గాలంటే ఉల్లిపాయ ముక్కతో మొటిమలు ఉన్న ప్రదేశంలో రుద్దాలి.

వంట చేస్తున్న సమయంలో చేతులు కాలటం సహజమే.ఆ కాలిన ప్రదేశంపై ఉల్లిపాయ ముక్కతో రుద్దితే వెంటనే ఉపశమనం కలుగుతుంది అంతేకాక ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది

ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది

ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి ఉదయం ఆ నీటిని నొప్పులు ఉనన్ ప్రదేశంలో రాస్తే నొప్పులు తగ్గిపోతాయి

ఈ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు దృడంగా పెరుగుతుంది

ఉల్లిపాయతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారుగా కాబట్టి తప్పనిసరిగా ఉల్లిపాయను వాడటం అలవాటు చేసుకోండి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు