ముల్లంగితో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా?

ఆరోగ్య‌క‌ర‌మైన దుంప‌ల్లో `ముల్లంగి` ఒక‌టి.ఘాటైన వాస‌న‌, రుచి క‌లిగి ఉండే ముల్లంగిని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

 Health Benefits Of Radish-TeluguStop.com

చాలా త‌క్కువ శాతం మంది మాత్ర‌మే ముల్లంగితో కూరలు, పచ్చళ్లు లేదా సలాడ్లు చేసుకుంటారు.అయితే ముల్లంగి తిన‌ని వారు ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే.

ఖ‌చ్చితంగా ముల్లంగిని డైట్‌లో చేర్చుకుంటారు.ఎందుకంటే, ముల్లింగిలో ఉండే పోష‌కాలు అటువంటివి కాబ‌ట్టి.

 Health Benefits Of Radish-ముల్లంగితో ఎన్ని జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముల్లంగితో ఎన్నో జ‌బ్బుల‌కు కూడా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌.మ‌రి ఆ వివ‌రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్.ఈ స‌మ‌స్య‌తో ప్ర‌తి ఏడాది కొన్ని వేల మంది మృతి చెందుతున్నారు.అయితే ముల్లంగి క్యాన్స‌ర్ నివారిణిగా ప‌ని చేస్తుంది.ముల్లంగి త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల.

అందులో ఉండే యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు వివిధ రకాల క్యాన్స‌ర్ల బారిన ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది.అలాగే మలబద్దకం, అజీర్తి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డే వారు ముల్లంగి తీసుకుంటే.

మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

జ్వ‌రం, ద‌గ్గు మ‌రియు జ‌లుబు స‌మ‌స్య‌లు ఉన్న వారు ముల్లంగి ఔష‌ధంలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముల్లంగిని ర‌సంలో తీసుకుని.అందులో తేనె మిక్స్ చేసుకుంటే.

జ్వ‌రం, ద‌గ్గు మ‌రియు జ‌లుబు దూరం అవుతాయి.యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటే ముల్లంగిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా బ‌ల‌ప‌డుతుంద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక చాలా మంది అధిక బ‌రువు త‌గ్గేందుకు డైటింగ్‌లు, వ‌ర్కౌట్లు ఇలా ఎన్నో చేస్తుంటారు.అలాంటి వారు కూడా ముల్లంగి తీసుకోవ‌చ్చు.ముల్లంగి తీసుకోవ‌డం వ‌ల్ల క్యాలరీలు పెంచ కుండానే ఆకలిని తీర్చుతుంది.త‌ద్వారా అధిక బ‌రువు సులువుగా త‌గ్గొచ్చు.

గ్లైసెమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉంటే ముల్లంగి మ‌ధుమేహ రోగుల‌కు ఎంతో మంచి చేస్తుంది.మ‌ధుమేహం ఉన్న‌వారు త‌ర‌చూ ముల్లంగి ర‌సం తీసుకుంటే.

బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ర్స్ పెర‌గ‌కుండా ఉంటాయి.అదే స‌మ‌యంలో ర‌క్త‌పోటును కూడా కంట్రోల్ చేస్తుంది.

#Radish #Health #Fever #Cancer #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు