జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

Health Benefits Of Nutmegs

జాజికాయను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తున్నాం.జాజికాయ వంటలకు రుచిని కలిగిస్తుంది.

 Health Benefits Of Nutmegs-TeluguStop.com

అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుస్కుందాం.జాజికాయను నేతిలో వేగించి పొడి చేసుకొని ఉంచుకోవాలి.5 గ్రాముల పొడిని ఆవుపాలతో కలిపి తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.అయితే జాజికాయను మోతాదు ప్రకారం మాత్రమే తీసుకోవాలి.

 Health Benefits Of Nutmegs-జాజికాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాంబూలం వేసుకొనేటప్పుడు చిటికెడు జాజికాయ పొడి వేసుకొంటే నోటి దుర్వాసనతో పాటు పంటి మీద నలుపునూ, గార తొలగిపోయి పళ్ళు మిలమిల మెరుస్తాయి.దగ్గు,జలుబు వచ్చినప్పుడు పీక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసుకొని త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

జాజికాయలో ‘మిరిస్టిసిన్’ అనే పదార్ధం ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది.అందువల్ల అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి దివ్య ఔషధంగా చెప్పవచ్చు.రెగ్యులర్ గా ఈ పొడిని తీసుకుంటూ ఉంటే అల్జీమర్స్ వ్యాధి తగ్గుముఖం పెట్టె అవకాశాలు ఉన్నాయి.

జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచ‌డం కోసం కూడా చాలా బాగా సహాయపడుతుంది.

కొంచెం జాజికాయ పొడిని తీసుకుని దానికి తేనె కలిపి పేస్ట్‌లాగా తయారు చేయాలి.దీన్ని ముఖానికి స్క్రబ్‌లా రాసుకోవాలి.ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతిగా మారటమే కాకుండా చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

#Nutmegs #Benefits #Nutmeg Powder

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube