ప్రతి ఇంటిలో పెరిగే ఈ మొక్క గురించి చాలా మందికి తెలియని రహస్యాలు   Health Benefits Of Marigold Flowers In Telugu     2017-11-14   21:54:53  IST  Lakshmi P

సాధారణంగా అందరికి బంతి పువ్వు గురించి తెలుసు. ఎలాగా అంటే బంతి పువ్వును తలలో పెట్టుకోవటం, అలంకరణ కోసం ఉపయోగించటం మరియు దేవుని పూజలో ఉపయోగించటం వరకు తెలుసు. అయితే బంతి పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బంతి పువ్వును ఇంగ్లిష్ లో మేరీ గోల్డ్ అని పిలుస్తారు. బంతి మొక్కకు పూవులు మొక్క నిండుగా పూసి చాలా అందంగా ఉండుట వలన దాదాపుగా పల్లెలో ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. అంతేకాక ఈ పువ్వులకు డిమాండ్ ఉండుట వలన తెలుగు రాష్ట్రాల్లో పంటగా పండిస్తున్నారు. బంతి పువ్వు పసుపు రంగు,నారింజ రంగు లో ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా అలంకరణకు మరియు దండలకు ఉపయోగిస్తారు.

పూర్వ కాలం నుండి బంతి పూలను ఆయుర్వేదంలోఉపయోగిస్తున్నారు . బంతి పువ్వులో ఉండే లక్షణాలు గాయాలను తొందరగా మానేలా చేస్తాయి. బంతి పువ్వు చిన్న చిన్న గాయాలు, దెబ్బలు మరియు చర్మ చికాకు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బంతి పువ్వుల నుండి తయారుచేసిన ఉత్పత్తులను నీటిలో కలుపుకొని త్రాగితే నోటి అల్సర్ మరియు పొట్టలో కలిగే అల్సర్ లు తగ్గుతాయి. అల్సర్ కి కారణం అయిన కారకాలను బయటకు పంపటంలో బంతి పువ్వు సమర్ధవంతంగా పనిచేస్తుంది.

బంతి పువ్వులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన గుండె సంబంధిత వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అలాగే శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

బంతిపువ్వులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులను మరియు ఆర్థరైటిస్ వ్యాధిని తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. బంతిపువ్వు నుండి తయారు చేసిన నూనెలను కీళ్ళనొప్పులను మరియు ఆర్థరైటిస్ వంటి వాటిని తగ్గించటానికి వాడుతున్నారు.

బంతిపువ్వు రేకులను నీటిలో కలిపి వేడి చేసి ఈ మిశ్రమాన్ని స్నానం చేసే వేడి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన మూత్రశయ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుంది.

బంతి పువ్వు చర్మంలో జిడ్డును తొలగించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తాజా బంతిపువ్వు ఆకులను తీసుకొని, వేడి నీటిలో వేడి చేసి, ఈ మిశ్రమాన్ని రోజులో ఒకసారి చర్మానికి రాయాలి. 10 నుండి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జిడ్డు చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.