నిమ్మకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...?

నిమ్మ పండు… కొందరు ఈ నిమ్మపండును నిమ్మ కాయ అని కూడా అంటుంటారు.వర్షాకాలంలో విరివిగా లభించే ఈ నిమ్మ పండు లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.

 Health Benefits Of Lemon, Lemon Juice, Dandruff, Lemon For Skin, Lemon Juice For-TeluguStop.com

అనేక రకాల కూరలలో, ఇంకా అనేక రకాల ఔషధాలలో ఈ నిమ్మ రసాన్ని ఉపయోగిస్తారు.ఇవి రుచికి చాలా పుల్లగా ఉంటాయి.

అయితే ఈ నిమ్మ పండు లను నిమ్మరసం చేసుకొని తాగడం ద్వారా అనేక రకాల ఉపయోగాలు మనకు లభిస్తాయి.అవేంటో ఒకసారి చూద్దామా…

వేసవి కాలంలో ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి ఈ నిమ్మరసాన్ని పంచదార లేదా ఉప్పు తో కలిపి పానీయంగా తీసుకుంటారు.

ఇక అలాగే మాంసం, చేపలు లాంటి వాడిని నిమ్మరసంలో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వండుకుంటే వాటి వల్ల ఆ పదార్థాలు కాస్త మెత్తబడి రుచిగా తయారవుతుంది.అలాగే కొంతమందికి శరీరంలో పత్యం ఉన్నవారు నిమ్మ పండు ఊరగాయ చేసుకుని తింటే వాటికీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ నిమ్మరసం వేసవి కాలంలో తీసుకోవడం ద్వారా శరీరంలో త్వరగా శక్తిని తిరిగి పొందవచ్చు.

నిమ్మ పండు ను ముఖ్యంగా ఆయుర్వేదంలో జీర్ణక్రియలో, చర్మ సౌందర్యానికి సంబంధించి బాగా ఉపయోగిస్తారు.

అంతేకాదు ఈ నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీళ్లలో కలుపుకుని, కాస్త ఉప్పు వేసుకొని తాగితే ఊబకాయ సమస్య నుంచి దూరం కావచ్చు.లావుగా ఉండే వారు రోజుకు వారి ఆహారాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకుంటూ రోజుకు రెండు లేదా మూడుసార్లు నిమ్మరసంతో సేవిస్తే బరువు తగ్గుతారు.

అంతేకాదు నిమ్మ పండు రసాన్ని కాస్త కొబ్బరి నూనెలో కలుపుకొని జుట్టుకు పట్టించుకుంటే తలలో ఉండే చుండ్రు, అలాగే ఏదైనా వెంట్రుకల సమస్యలు ఉన్న చాలావరకు మేలు చేకూరుతుంది.ఇక ఈ నిమ్మ రసం వలన అజీర్ణం, మలబద్ధకం లాంటి మొదలగు జీర్ణక్రియ వ్యాధులను నివారించడానికి ఈ నిమ్మ పండు రసం తాగితే చాలా వరకు ఉపయోగపడుతుంది.

కాబట్టి వీలైనంత వరకు బయట మార్కెట్ లో దొరికే సాఫ్ట్ డ్రింక్స్ కంటే ఈ నిమ్మ రసం తాగితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube