స‌మ్మ‌ర్‌లో లెమ‌న్‌ను ఇలా తీసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్?

చ‌లికాలం పోయి ఎండ కాలం వ‌చ్చింది.రోజు రోజుకు ఎండ‌లు మండిపోతున్నాయి.ఉద‌యం నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.మే నెల‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే న‌మోదు అవుతున్నాయి.భారీగా పెరిగిన‌ ఎండ‌ల దెబ్బ‌కు అత్యవసరమైన‌ పని ఏదైనా ఉంటే తప్ప ప్ర‌జ‌లు కాలు కూడా బయట పెట్ట‌డం లేదు.ఇక ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

 Health Benefits Of Lemon Water Summer Summer Tips Latest News-TeluguStop.com

అలాంటి వాటిలో లెమ‌న్ (నిమ్మ కాయ‌) కూడా ఉంది.

అవును, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో లెమ‌న్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

 Health Benefits Of Lemon Water Summer Summer Tips Latest News-స‌మ్మ‌ర్‌లో లెమ‌న్‌ను ఇలా తీసుకుంటే..మ‌స్తు బెనిఫిట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి లెమ‌న్‌ను ఎలా తీసుకుంటే మోర్ బెనిఫిట్స్ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముందు లెమ‌న్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు వాట‌ర్‌లో క‌ట్ చేసి పెట్టుకున్న నిమ్మ కాయ ముక్క‌లు, కొద్దిగా పుదీనా వేసి.రెండు లేదా మూడు గంట‌ల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

అనంత‌రం ఈ వాట‌ర్‌ను సేవించాలి.ఈ వాట‌ర్‌ను లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ అని అంటారు.

వేస‌వి కాలంలో చాలా మంది డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంటారు.అయితే ఈలెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే.శ‌రీరం హైడ్రేట‌డ్‌గా ఉంటుంది.అలాగే ఈ వాట‌ర్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.

వేస‌విలో ఇబ్బంది పెట్టే అతి దాహం, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.త‌ల‌నొప్పి, ఒత్తిడి వంటి జ‌బ్బులు కూడా దూరం అవుతాయి.

కొంద‌రు స్పైసీ ఫుడ్ తిన్న త‌ర్వాత నోటి దుర్వాస‌న‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే భోజ‌నం త‌ర్వాత ఈ వాట‌ర్ తీసుకుంటే నోరు ఫ్రెష్‌గా మారుతుంది.అదే స‌మ‌యంలో జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగుప‌డుతుంది.దాంతో గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మస్య‌లకు దూరంగా ఉండొచ్చు.

ఇక ఈ వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు.‌

.

#Lemon Water #Good Health #Summer #Lemon #BenefitsOf

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు