బెండకాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?  

  • బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది. అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకుంటే తప్పనిసరిగా బెండకాయను తింటారు. బెండకాయలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి. ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

  • -

  • బెండకాయ మధుమేహ రోగులకు సంజీవని అని చెప్పవచ్చు. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

  • బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

  • బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది.

  • బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి.

  • శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది.