టీ లో చక్కర కాకుండా బెల్లం వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Health Benefits Of Jaggery Tea

చాలామందికి గంటకొకసారి టీ తాగకపోతే వారికి రోజు గడవదు.ఇలా రోజుకు ఎన్నోసార్లు టీ తాగుతూ ఉంటారు.

 Health Benefits Of Jaggery Tea-TeluguStop.com

ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల అందులో ఉన్న చక్కెర శాతం క్యాలరీలను మన శరీరంలోకి వెళ్ళేలా చేస్తాయి.మన శరీరంలో కేలరీలు అధికంగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరుగుతారు.

అధిక బరువు పెరగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి.అయితే టీ లో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

 Health Benefits Of Jaggery Tea-టీ లో చక్కర కాకుండా బెల్లం వాడితే ఏం జరుగుతుందో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
మలబద్ధకంతో బాధపడేవారికి బెల్లం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.టీ లో బెల్లం వేసుకొని తాగడం ద్వారా మన శరీరంలో జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది.

అంతేకాకుండా జీర్ణ క్రియలో ఏర్పడే అజీర్తి వంటి సమస్యలన్నింటికీ కూడా బెల్లం మంచి పరిష్కారం.
బెల్లం లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

బెల్లం టీ లోనే మాత్రమే కాకుండా, ఇతర ఆహార పదార్థాలతో పాటు తీసుకోవడం ద్వారా అధికశాతం ఐరన్ మన శరీరానికి అందటం వల్ల రక్తహీనత వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.అంతేకాకుండా రక్తం సరఫరా సమృద్ధిగా జరిగి, అధిక రక్తపోటు నుంచి మనల్ని కాపాడుతుంది.

టీ లో బెల్లం తో పాటు కొద్దిగా అల్లం, మిరియాలు వేసుకొని తాగడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక శక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది.బెల్లం లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

టీ లో బెల్లం వేసుకొని తాగడం ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు.

#JaggeryTea #Tips #GingerBlack #BenefitsJaggery #Immunity

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube