మెంతులను ఈ విధంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

వంటకాలలో ఉపయోగించే మెంతుల( Fenugreek Seeds )వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అదే విధంగా మెంతులను కొన్ని విధాలుగా ఉపయోగించడం వలన మరిన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే మెంతులతో టీ చేసుకుని తాగడం చాలా మంచి పద్ధతి.మెంతి టీ అనేది ఒక ప్రసిద్ధ హెర్బల్ టీ.ఈ టీ ని మెంతులతో తయారు చేసుకోవాలి.ఆహారంగా, ఒక సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా ఇందులో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి.

సాంప్రదాయ వైద్యంలో వీటిని చాలా కాలంగా ఉపయోగిస్తూ వస్తున్నారు.మెంతులు చూడడానికి పసుపు రంగులో, రుచిలో చేదుగా ఉంటాయి.అయితే వీటిని నీటిలో మరిగించినప్పుడు ఆ నీరు ప్రత్యేకమైన వాసన రుచిని అందిస్తుంది.

ఆ నీళ్లలో కొద్దిగా తేనె కలిపి మెంతి టీ తయారు చేసుకోవాలి.ఈ విధంగా మెంతి టీ( Fenugreek Tea ) తీసుకొని తాగితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

అయితే మెంతి టీ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.ఈ మెంతి టీ నీ తాగితే జీర్ణ వ్యవస్థలో మంట తగ్గుతుంది.అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.

అంతేకాకుండా జీర్ణ క్రియ( Digestion ) కూడా మెరుగుపడుతుంది.మెంతి టీ లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉన్నాయి.

ఈ సమయంలో శరీరం లో మంటను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.అంతేకాకుండా ఆర్థరైటిస్( Arthritis ), ఇతర కీళ్ల నొప్పులను ఉన్నప్పుడు ఒక మెంతి టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

మెంతి టీ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయి( Blood Sugar Levels ) నియంత్రణలో ఉంటుంది.ఎందుకంటే ఈ టీ లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సామర్థ్యం ఉంది.అందుకే మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కోసం సహజ ఔషధంగా మెంతి టీ నీ తీసుకోవడం మంచిది.

Advertisement

ఇక మహిళలు నెలసరి సమయంలో మెంతి టీ తాగితే ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. గర్భాశయం లోని కండరాల నొప్పులు కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

మెంతి టీ తాగడం వలన పాలిచ్చే తల్లులలో రొమ్ము పాల ఉత్పత్తి( Breast Milk ) పెరుగుతుంది.ఈ టీలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలు ఉన్నాయి.

తాజా వార్తలు